ద.కొరియా అధ్యక్షుడికి ఉపశమనం

Published on Sun, 12/08/2024 - 06:11

సియోల్‌: ఎమర్జెన్సీ ప్రకటిస్తూ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఇంటాబయటా విమర్శలను ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కు పదవీగండం కొద్దిలో తప్పింది. ఎమర్జెన్సీ(మార్షల్‌ లా) విధిస్తూ నిర్ణయం తీసుకుని దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరలేపారని ఆరోపిస్తూ ఆయనపై విపక్షాలు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. 

300 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో అభిశంసన తీర్మానం నెగ్గాలంటే మూడింట రెండు వంతుల మంది సభ్యులు అంటే కనీసం 200 మంది మద్దతు పలకాల్సి ఉంటుంది. శనివారం చేపట్టిన ఓటింగ్‌లో అభిశంసనను సమర్థిస్తూ కేవలం 192 ఓట్లు పడ్డాయి. యూన్‌కు చెందిన పీపుల్స్‌ పవర్‌ పార్టీ ఓటింగ్‌ను బహిష్కరించింది. వచ్చే బుధవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సెషన్‌లో మరోమారు అభిశంసన తీర్మానాన్ని పెట్టాలని విపక్ష పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. అంతకుముందు యూన్‌  మార్షల్‌ లా విధించడం తప్పేనంటూ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపారు.

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)