Breaking News

యూన్‌ వేతనం పెరిగింది!

Published on Tue, 01/14/2025 - 06:08

సియోల్‌: దేశంలో స్వల్ప కాలం మార్షల్‌ లా అమలు చేసినందుకు అభిశంసనకు గురైన దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ వార్షిక వేతనం భారీగా పెరిగింది. అధికార ప్రమాణాలను అనుసరించి మూడు శాతం మేర పెరిగి రూ.1.27 కోట్ల నుంచి రూ.1.55 కోట్లకు చేరింది. యూన్‌కే కాదు, ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టి అభిశంసనకు గురైన తాత్కాలిక అధ్యక్షుడు హన్‌ డక్‌–సూకు వార్షిక వేతనంలో మూడు శాతం పెరిగి, రూ.1.19కోట్లకు చేరుకోవడం గమనార్హం. 

యూన్‌ను డిసెంబర్‌లో పార్లమెంట్‌ అభిశంసించింది. దేశంలో తిరుగుబాటుకు యత్నించడం, అధికార దురి్వనియోగం ఆరోపణలపై దర్యాప్తు విభాగాలు అరెస్ట్‌కు చేస్తున్న యత్నాలను ఆయన అడ్డుకుంటున్నారు. ఫలితంగా దేశంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆయనకు ఎలాంటి అధికారాలు లేనప్పటికీ అభిశంసనపై దక్షిణకొరియా రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించే వరకు అధికార నివాసం, కార్యాలయంలోనే కొనసాగేందుకు అవకాశముంటుంది.

 సస్పెన్షన్‌కు గురైన అధ్యక్షుడికి ఇప్పటికీ వేతనం అందుకుంటున్న విషయం తెలీన ప్రజలు..తాజా పెంపు విషయం తెలిసి ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో కనీస వేతనానికి రెట్టింపు మొత్తంలో యూన్‌ వేతనం పెరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఉద్యోగులకు 1.7 శాతం మాత్రమే పెరగ్గా యూన్‌ 3%కి ఎలా పెంచుతారని నెటిజన్లు పళ్లు కొరుకుతున్నారు. ఈ నేపథ్యంలో యూన్‌ను ఎలాగైనా అరెస్ట్‌ చేసి తీరుతామని అవినీతి నిరోధక విభాగం స్పష్టం చేస్తోంది. ఈసారి పోలీసులను వెంటబెట్టుకుని వెళతామని, భద్రతా సిబ్బంది, ప్రజాప్రతినిధులు సహా అడ్డు వచి్చన వారిని సైతం అరెస్ట్‌ చేస్తామని హెచ్చరిస్తోంది.  
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)