Breaking News

సొంత పౌరులపైనే ద.కొ. బాంబులు

Published on Thu, 03/06/2025 - 10:44

సియోల్‌: దక్షిణ కొరియా సైన్యం శిక్షణలో(Military Drill Excercise) అపశ్రుతి చోటు చేసుకుంది. సొంత పౌరులపైనే యుద్ధ విమానం బాంబులు జారవిడిచింది.  ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఆపై పొరపాటున ఈ దాడి జరిగినట్లు చెబుతూ సైన్యం పౌరులను క్షమాపణలు కోరింది.

గురువారం ఉదయం పోచియాన్‌(Pocheon)లో సైన్యం-వైమానిక దళం సంయుక్తంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించాయి. కేఎఫ్‌-16 విమానం నుంచి నిర్దేశించిన లక్ష్యంలో ఎంకే-82 బాంబులను జార విడచాల్సి ఉంది. అయితే  నిర్దేశిత లక్ష్యంలో కాకుండా.. జనావాసాలపైకి విమానం దూసుకెళ్లింది. మొత్తం ఎనిమిది బాంబులు వేసింది. దీంతో పలువురికి గాయాలుకాగా.. చికిత్స కోసం వాళ్లను ఆస్పత్రికి తరలించారు. వీళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం

జరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన సైన్యం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే బాధితులకు పరిహారం అందజేస్తామని, ఘటనపై దర్యాప్తు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. 

ఇదిలా ఉంటే.. దక్షిణ కొరియా(South Korea) రాజధాని సియోల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో పోచియాన్‌ ఉంది. దీనికి సమీపంలోనే ఉత్తర కొరియా సరిహద్దు ఉంది. త్వరలో అమెరికా-ద.కొ. సైన్యాల సంయుక్త ప్రదర్శన జరగాల్సి ఉంది. అయితే ఇందుకోసం గురువారం నుంచి పోచియాన్‌లో ఇరు దేశాల సైన్యాలు ప్రాక్టీస్‌ చేస్తాయని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది కూడా. 

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)