Breaking News

విమానంలో మంటలు.. 176 మంది ప్రయాణికులు సురక్షితం

Published on Wed, 01/29/2025 - 07:57

సియోల్‌: దక్షిణ కొరియాలోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ బుసాన్ ఎయిర్‌బస్ ఏ321 ప్యాసింజర్ విమానం మంటల్లో చిక్కుకుంది. దీనిని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై విమానంలోని 169 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 176 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం విమానం హాంకాంగ్‌కు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి 10.15 జరిగింది. గాలితో నిండిన స్లయిడ్‌లను ఉపయోగించి ప్రయాణీకులను ఖాళీ చేయించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
 

ఈ విమానం 17 ఏళ్ల క్రితం నాటి ఎయిర్‌బస్ ఏ321 సీఈఓ మోడల్ అని దాని టెయిల్ నంబర్  హెచ్‌ఎల్‌ 7763 అని ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ మీడియాకు తెలిపింది. గత నెలలో కూడా ఇటువంటి ప్రమాదం చోటుచేసుకుంది. 2024 డిసెంబర్ 29న మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెజు ఎయిర్ బోయింగ్ 737-800 విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న 181 మందిలో 179 మంది మృతి చెందారు.

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: యూపీ, బీహార్‌ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్‌ జామ్‌.. 70 కి.మీ. పొడవునా..

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)