Breaking News

దక్షిణ కొరియాలో మంచు తుఫాను.. మూసుకుపోయిన రహదారులు

Published on Thu, 11/28/2024 - 09:18

సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో కురుస్తున్న భారీ హిమపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. భారీ మంచు తుఫాను కారణంగా వందలాది విమానాలు రద్దు అయ్యాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ మంచు తుఫాను గత 50 ఏళ్లలో సంభవించిన అత్యంత భారీ విపత్తుగా చెబుతున్నారు.  సియోల్ పరిసర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల మేర మంచు కురిసిందని దక్షిణ కొరియా వాతావరణశాఖ తెలిపింది. 1972, నవంబర్ 28న సియోల్‌లో 12 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. ఈ మంచు తుఫాను ప్రభావం దేశంలోని పలు ప్రాంతాలలో కనిపించింది.
 

దేశంలోని మధ్య, తూర్పు, నైరుతి ప్రాంతాలలో దాదాపు 10 నుండి 23 సెం.మీ. మేరకు హిమపాతం కురిసింది. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో 220 విమానాలు రద్దు కాగా, 90 బోట్లను ఓడరేవులోనే ఉంచాలని అధికారులు ఆదేశించారు. సియోల్‌లోని రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ట్రాఫిక్ స్థంభించింది. రోడ్లపై కూలిపోయిన చెట్లను తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. 

ఇది కూడా చదవండి: నేటి పార్లమెంట్‌లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)