Breaking News

గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలపై గ్లోబల్‌ ట్యాక్స్‌

Published on Sat, 04/12/2025 - 04:40

లండన్‌: గ్లోబల్‌ వార్మింగ్‌ కట్టడి దిశగా కీలక ముందడుగు పడింది. ఈ దిశగా ప్రపంచ దేశాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలపై గ్లోబల్‌ ట్యాక్స్‌ విధించేందుకు మొట్టమొదటిసారిగా రంగం సిద్ధమైంది. షిప్పింగ్‌ వనరుగా ఉన్న ప్రధాన దేశాలు ఇందుకు అంగీకారం తెలిపాయి. దీని ప్రకారం.. నౌకలు విడుదల చేసే ప్రతి టన్ను కార్బన్‌ డయాక్సైడ్‌పై ఇకపై కనీసం 100 డాలర్ల చొప్పున పన్ను విధించనున్నాయి.

 ఆయా దేశాల నౌకలు లక్ష్యాలను చేరలేకపోయినా, ఇంటర్నేషనల్‌ మారిటైం ఆర్గనైజేషన్‌ నెట్‌ జీరో ఫండ్‌కు నిధులందించకున్నా 2028 నుంచి ఈ ట్యాక్స్‌ను వసూలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం లండన్‌లో 60కిపై దేశాలు ప్రతినిధులతో ఇంటర్నేషనల్‌ మారిటైం ఆర్గనైజేషన్‌ (ఐఎంవో) సమావేశం జరిగింది. అయితే అగ్ర రాజ్యం అమెరికా మాత్రం దీనికి గైర్హాజరు కావడం గమనార్హం. 

ఓడల్లో వాడే ఇంధనానికి సైతం ఈ సమావేశం పలు ప్రమాణాలను నిర్దేశించింది. మొత్తం ఉద్గారాల్లో షిప్పింగ్‌ వాటా 3 శాతమని ఐరాస గణాంకాలు చెబుతున్నాయి. ఓడల సంఖ్యతో పాటు వాటి పరిమాణం పెరుగుతుండటం, అందుకు అనుగుణంగా ఇంధన వాడకం విపరీతంగా పెరిగి పోతుండటంతో రానున్న రోజుల్లో షిప్పింగ్‌ ఉద్గారాలు ఇంకా ఎక్కువవుతాయని భావిస్తున్నారు. ఐఎంవో భేటీలో కుదిరిన ఒప్పందంపై సెక్రటరీ జనరల్‌ ఆర్సెనియో డొమింగెజ్‌ హర్షం వెలిబుచ్చారు.  వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, షిప్పింగ్‌ ఆధునీకరణకు ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఈ బృందం అర్థవంతమైన ఏకాభిప్రాయాన్ని సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
 

Videos

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)