Breaking News

అస్థికలు భద్రపరిచేందుకు అద్దె రూ.63 లక్షలు, ఫ్యామిలీ ప్యాక్‌ కూడా!

Published on Mon, 07/10/2023 - 04:35

ప్రపంచ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతం ఏదంటే హాంకాంగ్‌ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఒక జత చెప్పుల డబ్బా అంతటి విస్తీర్ణం ఉన్న స్థలం కూడా వేల డాలర్లు పలుకుతుంది. అలాంటి ప్రాంతంలో చూపరుల్ని ఆకట్టుకునే 12 అంతస్తుల అందమైన భవనాన్ని ఈ మధ్య నిర్మించారు. పాలరాతితో, వంపులు తిరిగిన డిజైన్, రూఫ్‌ గార్డెన్‌తో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ భవనాన్ని చూస్తే ఎవరైనా ఫిదా(వశం) అయిపోతారు. అయితే అది నిర్మించింది ధనవంతులు నివసించడం కోసం కాదు. మరణించిన వారి అస్థికలను భద్రపరచడం కోసం ప్రత్యేకంగా నిర్మించారు.

ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ ఎలా ఉంటుందో అదే స్థాయిలో అందులో సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. షాన్‌ సమ్‌ టవర్‌ పేరుతో నిర్మించిన ఈ భవనంలో అస్థికల కలశాన్ని భద్రపరచాలంటే 76,000 డాలర్లు (రూ.63 లక్షలు) చెల్లించాలి. అది కూడా 10 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత లీజ్‌ రద్దయిపోతుంది. ఎందుకంటే ఆ భవనంలో 22,000 మంది అస్థికలను మాత్రమే భద్రపరచవచ్చు. ఒక కుటుంబంలో ఎనిమిది మంది అస్తికలను భద్రపరచడానికి ఫ్యామిలీ ప్యాకేజీ సదుపాయం ఉంది. అందుకయ్యే ఖర్చు 4,40,000 డాలర్లు (రూ.3.64 కోట్లు). షాన్‌ సమ్‌ అంటే చైనా భాషలో దయా హృదయం అని అర్థం. ఈ భవనం సంపన్నులకే అందుబాటులో ఉండడం గమనార్హం.  

అంతా అత్యాధునికం  
కేవలం అస్థికల కోసం ఇంత ఖరీదా? అని ఎవరైనా నోరెళ్లబెట్టొచ్చు. కానీ, అక్కడున్న హంగులు, ఆర్భాటాలు చూస్తే మతి పోవాల్సిందే. తమకెంతో ఇష్టమైన వారిని స్మరించుకోవడానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ భవనాన్ని నిర్మించారు. పైన అంతా రూప్‌గార్డెన్‌ ఉంటుంది. ప్రతి అంతస్తులోనూ పెద్ద పెద్ద బాల్కనీలు ఉంటాయి. చైనా సంస్కృతి సంప్రదాయాల్లో శ్మశాన వాటికలు ఎలా ఉంటాయో అలా వంపుల తిరిగిన డిజైన్‌తో భవనం ఉంటుంది.

ఇక లోపల పాలరాతి ఫ్లోరింగ్, ఏసీలు, గాలిలో తేమని తొలగించే వ్యవస్థ కూడా ఉన్నాయి. అస్థికలను భద్రపర్చే చిన్నచిన్న గదుల తలుపులను బంగారు నాణేలతో సౌందర్యభరితం చేశారు. భిన్న సంప్రదాయాలు, ఆచారాలను పాటించే వారి అభిరుచులకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం జరిగింది. పెద్దలకి నివాళులరి్పంచుకోవడానికి ముందస్తుగా యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. వారికిష్టమైన ఆహారాన్ని వండి తీసుకువెళ్లి, సంప్రదాయబద్ధంగా నివేదించవచ్చు.   

పెద్దలను గౌరవించుకోవడానికి  
మనుషుల అస్థికల కోసం ప్రత్యేకంగా అందమైన భవనం కట్టాలన్న ఆలోచన ఏడు పదుల వయసున్న మార్గరెట్‌ జీ అనే ఒక మహిళా పారిశ్రామికవేత్తకు వచ్చింది. జ్యువెలరీ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తున్న ఆమె వయసు మీదపడ్డాక సేవా కార్యక్రమాల బాట పట్టారు. తన పేరు మీదే ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సమాజానికి సేవలందిస్తున్నారు.‘‘మరణించిన పెద్దలకి నివాళులర్పించడానికి చైనా సంప్రదాయంలో చాలా ప్రాధాన్యతనిస్తారు. దివికేగిన పెద్దల స్మృతుల్లో గడిపి, వారిని గౌరవిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. అలాంటి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ భవనం నిర్మించాం’’ అని
మార్గరెట్‌ చెప్పారు.   

భర్త మరణంతో..  
హాంకాంగ్‌ నగర జనాభా 70 లక్షలపైమాటే. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనాభా కిటకిటలాడిపోతూ ఉంటుంది. వాస్తవానికి విస్తీర్ణంలో హాంకాంగ్‌ పెద్దదే. కానీ కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండడం వల్ల నివాసయోగ్యమైన ప్రాంతం తక్కువే. అందుకే ఇక్కడ ఆకాశహార్మ్యాల నిర్మాణం ఎక్కువగా ఉంది. ఈ నగరంలో ఒక ఇంటి సగటు విస్తీర్ణం 430 చదరపు అడుగులు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. అస్థికల భవన నిర్మాణాన్ని తలపెట్టిన మార్గరెట్‌ భర్త 2007లో మరణించారు. ఆయన స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడానికి ఆమెకి స్థలం దొరకలేదు.

ఆ సమయంలోనే మరణించిన వారి కోసం ప్రత్యేకంగా ఒక అపార్ట్‌మెంట్‌ నిర్మించాలన్న ఆలోచన ఆమెకు వచి్చంది. అది ఇన్నేళ్లకి సాధ్యమైందని చెబుతున్నారు. ఇక హాంకాంగ్‌లో వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. ప్రతి అయిదుగురిలో ఒకరు 65 ఏళ్లకు పైబడిన వారే. ఇక నగరంలో ప్రతి ఏటా దాదాపు 46,000 మంది మరణిస్తున్నారు. వారి అవశేషాలను భద్రపరచడానికి ప్రభుత్వం పలు సదుపాయాలు ఏర్పాటు చేసింది. అయితే అవి సరిపోకపోవడం వల్ల ప్రైవేట్‌ భవనం నిర్మించాల్సి వచి్చంది. హాంకాంగ్‌లో సంపన్నులు కూడా ఎక్కువే. అలాంటి వారి సౌకర్యార్థం షాన్‌ సమ్‌ అందుబాటులోకి వచి్చంది.
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)