Breaking News

100కోట్ల మంది మైనర్లపై లైంగిక వేధింపులు..!

Published on Wed, 12/10/2025 - 12:33

మహిళల రక్షణకై ప్రపంచవ్యాప్తంగా ఎన్నిచట్టాలు తెచ్చినా పెద్దగా ఫలితాలు ఉండడం లేదు. అబలలపై ఆగడాలు నానాటికీ పెరుగుతూ పోతున్నాయి. మైనర్లపై జరుగుతున్న లైంగిక వేదింపులపై న్యూ లాన్సెంట్ చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 100కోట్లకు పైగా మైనర్లు లైంగిక వేదింపులు ఎదుర్కొన్నట్లు సర్వేలో వెల్లడైంది.

అభం శుభం తెలియని వయసులో బాలికలు లైంగిక వేధింపులకు గురవడం తీవ్రంగా కలిచివేస్తుంది. మైనర్లపై లైంగిక వేధింపుల కట్టడికీ ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన పెద్దగా ఫలితం లేకుండా పోతుంది. మైనర్లపై దాడికి పాల్పడేవారిలో అధికశాతం వారికి తెలిసిన వారో లేదా బంధువులే కావడం చాలా బాధాకర విషయం.  ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది కలిగిన దిలాన్సెంట్ జర్నల్‌ నివేదికలో ఈవిషయాలే వెల్లడయ్యాయి. మైనర్లపై లైంగిక వేధింపులు నానాటికీ పెరుగుతున్నట్లు ది లాన్సెంట్ జర్నల్‌ నివేదికలో వెల్లడైంది.

2023 సంవత్సరాలనికి గానూ ప్రపంచవ్యాప్తంగా మహిళలపై వేధింపులు అనే అంశంలో దిలాన్సెంట్ సర్వే నిర్వహించింది. అందులో (బిలియన్) 100 కోట్లకు పైగా మహిళలు 15 లేదా అంతకంటే అధిక వయస్సులో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తేలింది.వారిలో 68 లక్షలుపై పైగా వారి సన్నిహితుల నుండి వేధింపులు ఎదుర్కొన్నట్లు ప్రచురించింది. ఇండియాలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారిలో 15 సంవత్సరాల లోపు వారు  23 శాతం ఉండగా ఆ పైబడిన వారు దాదాపు 30 శాతంగా ఉన్నట్లు తెలిపింది. అంతే కాకుండా 15 సంవత్సరాల లోపు  బాలురలో జరిగే లైంగిక వేధింపులలో భారత్‌ నుంచి 13 శాతం జరుగుతున్నట్లు పేర్కొంది.

ఈ లైంగిక వేధింపుల్లో అధికశాతం సబా- సహార ఆఫ్రికన్, సౌత్‌ ఆసియా ప్రాంతం నుంచే ఎదురవుతున్నట్లు నివేదిక తెలిపింది. ఈ వేధింపుల వల్ల హైచ్‌ఐవీ లాంటి ప్రమాదకర వైరస్‌ సోకడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ‍వస్తున్నాయని పేర్కొంది. గ్లోబన్ బర్డన్ డీసిజెస్‌లో ప్రచురించిన డేటా ఆదారంగా ది లాన్సెంట్‌ ఈ స్టడీ నివేదిక ప్రచురించింది.

2023 సంవత్సరంలో మహిళలపై జరిగిన హింసపై వరల్డ్ హెల్త్‌ ఆర్గనైజేషన్ జరిపిన స్టడీలో భారత్‌లో 15-49 సంవత్సరాల వయస్సు గల మహిళలు అధికంగా లైంగిక వేధింపులు లేదా గృహహింస ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై గృహహింసపై జరుపుతున్న స్టడీలో భారత్‌ నుంచి 20శాతం ఉన్నట్లు ప్రచురించింది. వారిలో 30 శాతం మంది జీవిత కాలం గృహహింస ఎదుర్కొంటున్నట్లు నివేదిక పేర్కొంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)