Breaking News

ఢాకాలో వరుస పేలుళ్లు

Published on Tue, 11/11/2025 - 06:05

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో సోమవారం వేకువజామున వరుస పేలుళ్లు సంభవించాయి. గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం వెలుపల, దేశ ఆపద్ధర్మ ప్రభుత్వ పాలకుడు యూనస్‌ మహ్మద్‌ అనుచరుడికి చెందిన వ్యాపార సంస్థ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మీర్‌పుర్‌లో ఉన్న గ్రామీణ బ్యాంకు వద్దకు బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు రోడ్డుపై పెట్రోల్‌ బాంబులను విసిరివెళ్లారు’అని వివరించారు. 

అదేవిధంగా, మహ్మద్‌పూర్‌లోని ప్రొబర్తన అనే ఆహార ఉత్పత్తుల కంపెనీ ఆవరణలో ఇలాంటి మరో రెండు పేలుళ్లు జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ కంపెనీ యజమాని యూనస్‌ ప్రభుత్వంలో మత్స్యశాఖను పర్యవేక్షిస్తున్న ఫరిదా అఖ్తర్‌ అనుచరుడని చెప్పారు. అదేవిధంగా, నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు బస్సులకు నిప్పుపెట్టారు. ఈ మూడు ఘటనల్లో ఎవరికీ ఎలాంటి అపాయం సంభవించలేదన్నారు. 

అనుమానితుడొకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్నారు. ఇతడు పదవీచ్యుత ప్రధాని హసీనా సారథ్యంలోని అవామీ లీగ్‌ అనుబంధ విద్యార్థి సంఘ సభ్యుడని చెప్పారు. ఇతడికి గతంలోనూ అనే పేలుళ్లతో సంబంధముందన్నారు. వీటితోపాటు ధన్‌మోండి మార్కెట్‌ ప్రాంతంలో రెండు చోట్ల పెట్రోల్‌ బాంబులు పేలాయి. ఢాకా పాతనగరంలో ఓ ఆస్పత్రి వద్ద దుండగులు ఒకరిని కాల్చి చంపారు. కాగా, ఆపద్ధర్మ ప్రభుత్వప్రధాన సలహాదారుగా ఉన్న యూనస్, 1983లో గ్రామీణ బ్యాంకును స్థాపించారు. పేదరికాన్ని తొలగించేందుకు, మహిళల సాధికారతకు పాటుపడుతున్న యూనస్‌ 2006లో నోబెల్‌ శాంతి బహుమతి గెలుచుకోవడం తెల్సిందే.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)