Breaking News

మరో జెట్‌ విమానాన్ని కోల్పోయిన అమెరికా 

Published on Fri, 05/09/2025 - 05:11

దుబాయ్‌: ఎర్ర సముద్రంలోని యూఎస్‌ఎస్‌ హారీ ఎస్‌ ట్రూమన్‌ విమాన వాహన నౌకపై మోహరించిన మరో ఫైటర్‌ జెట్‌ సముద్రంలో ప్రమాదవశాత్తూ పడిపోయింది. అధునాతన ఎఫ్‌/ఏ–18 సూపర్‌ హార్నెట్‌ రకం విమానం ల్యాండయ్యే క్రమంలో జరిగిన పొరపాటుతో షిప్‌పై నుండే స్టీల్‌ వైర్‌ తాళ్లకు హుక్‌ కాలేదని, ఫలితంగా జారి సముద్ర జలాల్లో పడిపోయిందని ఓ అధికారి చెప్పారు. అందులోని ఇద్దరు పైలట్లను హెలికాప్టర్‌ సాయంతో రక్షించామని, ఘటనలో వారిద్దరూ గాయపడ్డారని వివరించారు. ఈ జెట్‌ ఖరీదు రూ.513 కోట్లు. 

ఇదే షిప్‌పై సరిగ్గా ఇలాంటి విమానమే ఏప్రిల్‌లో ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోవడం తెల్సిందే. గతేడాది డిసెంబర్‌లో అమెరికాకే చెందిన యూఎస్‌ఎస్‌ గెట్టిస్‌బర్గ్‌ నౌక గైడెడ్‌ మిస్సైల్‌ ప్రయోగించి మరో ఎఫ్‌/ఏ–18ను పొరపాటున కూలి్చవేసింది. ట్రూమన్‌ విమాన వాహక నౌక ఫిబ్రవరిలో ఈజిప్టులోని పోర్‌ సయీద్‌లో వాణిజ్య నౌకను ఢీకొట్టింది. ఎర్ర సముద్ర జలాల్లో పశ్చిమ దేశాల వాణిజ్య నౌకలపై హౌతీల దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పటికే ఉన్న యూఎస్‌ఎస్‌ కార్ల్‌ విన్సన్‌కు తోడుగా అమెరికా ప్రభుత్వం యూఎస్‌ఎస్‌ హారీ ట్రూమన్‌ను ఇక్కడికి పంపించింది.
 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు