Breaking News

తేలు విషం ఖరీదు ఎంతో తెలుసా?

Published on Mon, 09/04/2023 - 07:26

కొన్ని రోజుల క్రితం పాముల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషాన్ని సేకరించడం కోసమే వాటిని పెంచుతారు. ఇప్పుడు తాజాగా తేళ్ల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఒక గదిలో తేళ్లను పెంచడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. నిజానికి తేలు కరిస్తే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. తేలు విషం ప్రాణాంతకం. అందుకే ఎవరైనాసరే తేళ్లకు దూరంగా ఉండాలని కోరుకుంటారు.

ఒకేచోట కొన్ని వేల తేళ్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? అవును.. ఇటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో  తేళ్లను ప్రత్యేక అరలలో ఉంచి పెంచుతుండటం కనిపిస్తుంది. వాటికి ఆహారం వేయడాన్ని కూడా చూడవచ్చు. తేళ్ల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం  అజాగ్రత్తగా ఉన్నా అది ప్రాణాలమీదకు వస్తుంది. ఇంతకీ తేళ్లను ఎందుకు పెంచుతారు? వీటి వలన ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఔషధాల తయారీ
తేళ్లను రెండు ప్రయోజనాల కోసం పెంచుతారు. మనిషిని చంపగల తేలు విషాన్ని అనేక రకాల ఔషధాల తయారీలో వినియోగిస్తారు. తేలు విషాన్ని క్యాన్సర్‌తో సహా అనేక ప్రాణాంతక వ్యాధులలో వినియోగిస్తారు. వాటి విషాన్ని ప్రత్యేకంగా నిల్వ  చేస్తారు. పలు దేశాలలో తేళ్లను తింటారు. కాగా ఒక్కో తేలు ప్రతిరోజూ 2 మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని తేళ్ల పెంపకందారులు ఎంతో జాగ్రత్తగా సేకరిస్తారు. తేలు విషం లీటరు ధర 10 మిలియన్‌ డాలర్లు (రూ. 74 కోట్ల 15 లక్షలు) తేలు విషాన్ని సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకు కొన్ని మిలియన్ల మంది వీక్షించారు.
ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి నేతలు
 

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)