Breaking News

800 మందికి శాంసంగ్‌ ఝలక్‌ : కారణం ఇదే!

Published on Mon, 07/20/2026 - 12:06

గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌ వందలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడం కలకలం రేపింది. అమెరికా (US) మొబైల్, డిస్‌ప్లే,  కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాలలో ఉద్యోగాల కోతను విధిస్తోంది. రాయిటర్స్ కథనం ప్రకారం, న్యూజెర్సీ,టెక్సాస్‌లోని కంపెనీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది.

ఆఫీసు చేంజ్‌ : శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్ అమెరికా (SEA) తన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రధాన కార్యాలయాన్ని న్యూజెర్సీలోని 'ఎంగ్ల్‌వుడ్ క్లిఫ్స్' నుండి టెక్సాస్‌లోని 'ప్లానో'కు మారుస్తోంది.  'వార్న్' (WARN) నోటీసు ప్రకారం, ఎంగ్ల్‌వుడ్ క్లిఫ్స్ కార్యాలయంలోని 739 ఉద్యోగాలపై దీని ప్రభావం పడనుంది. అక్కడ మొత్తం 1,200 మంది ఉద్యోగులు ఉండగా... అందులో 60 శాతానికి పైగా సిబ్బంది ఈ మార్పుల వల్ల ప్రభావితం అవుతున్నారు. ముఖ్యంగా టెక్సాస్‌కు మారడానికి ఇష్టపడని వారిపై  వేటు వేసింది.

టెక్సాస్ కార్యాలయంలో మార్పులు
టెక్సాస్‌లోని ప్లానో కార్యాలయంలో ఉన్న మొబైల్ విభాగానికి చెందిన సుమారు 100 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. గత రెండు వారాల్లో సీనియర్ సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా 30 మందికి పైగా ఉద్యోగులు తాము కంపెనీ నుండి వైదొలిగినట్లు లింక్డ్‌ఇన్ (LinkedIn) ద్వారా స్పష్టం చేశారు.

శాంసంగ్‌ వివరణ    
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మారుతున్న ఆధునిక టెక్నాలజీ మార్కెట్‌కు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు శాంసంగ్  వెల్లడించింది. జూన్ 30న ఉద్యోగులకు అంతర్గతంగా  సంస్థాగత ఉద్యోగాల తగ్గింపు నోటీసులు ఇచ్చినప్పటికీ, దీనిని భారీ లేఆఫ్స్‌గా భావించకూడదని శాంసంగ్ పేర్కొంది. ప్రభావితమైన ఉద్యోగులలో చాలా మందికి టెక్సాస్‌కు బదిలీ అయ్యే (Relocate) అవకాశం కల్పించామని కంపెనీ తెలిపింది. కేవలం మారడానికి వీలులేని వారు లేదా విధులు రద్దయిన వారు మాత్రమే ఉద్యోగాలు కోల్పోతారని స్పష్టం చేసింది.కంపెనీ సెమీకండక్టర్ (చిప్స్) విభాగం రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తుండగా, చిప్ ధరల పెంపు, తక్కువ మార్జిన్ల కారణంగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం మాత్రం  తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)