Breaking News

మనిషి మొదటి శాలరీ ఉప్పు?

Published on Thu, 02/22/2024 - 13:05

ఉద్యోగం చేసే వ్యక్తి జీవితంలో  శాలరీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉద్యోగులు ‍ప్రతినెలా తమ శాలరీ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఈ శాలరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒకానొక కాలంలో శాలరీ పేరుతో ఉప్పును ఇచ్చేవారనే సంగతి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పురాతన రోమ్‌లో డబ్బుకు బదులుగా ఉప్పును ఉపయోగించేవారు. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలో పనిచేసే సైనికులకు వారి పనికి ప్రతిఫలంగా ఉప్పును ఇచ్చేవారు. ‘ఉప్పు ఋణం’ లాంటి సామెతలు  ఆ కాలం నుంచే ఉద్భవించాయని చెబుతుంటారు.

ప్రముఖ మీడియా సంస్థ అందించిన ఒక నివేదిక ప్రకారం రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ తన ‘నేచురల్ హిస్టరీ’ పుస్తకంలో.. రోమ్‌లో సైనికులకు ఉప్పు రూపంలో శాలరీ ఇచ్చేవారని పేర్కొన్నారు. శాలరీ అనే పదం ఉప్పు నుండి వచ్చిందని దానిలో తెలిపారు. సోల్జర్ అనే పదం లాటిన్ పదం 'సల్ డేర్' నుండి ఉద్భవించిందని, దీని అర్థం ‘ఉప్పు ఇవ్వడం’ అని పలు నివేదికలు పేర్కొన్నాయి. రోమన్‌లో ఉప్పును సలారియం అంటారు. దీని నుండి శాలరీ అనే పదం ఉద్భవించింది.

10,000 బీసీ, 6,000 బీసీ మధ్య మొదటిసారి శాలరీ ఇచ్చారని ఫ్రెంచ్ చరిత్రకారులు భావిస్తున్నారు. పురాతన రోమ్‌లో పనికి బదులుగా బదులుగా ఉప్పు ఇచ్చేవారు. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని సైనికులకు శాలరీగా వారి చేతినిండా ఉప్పు ఇచ్చేవారు. అప్పట్లో ఉప్పు వ్యాపారం కూడా బాగా జరిగేది. 

#

Tags : 1

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)