Breaking News

అతి పలుచని వాచీ

Published on Mon, 09/09/2024 - 06:32

ప్రపంచంలోనే అతి పలుచని చేతి గడియారాన్ని తయారు చేయడానికి యూరోపియన్‌ హోరాలజీ దిగ్గజాలన్నీ తెగ పోటీ పడుతుంటేం రష్యాకు చెందిన ఓ స్వతంత్ర వాచ్‌ మేకర్‌ ఆ అద్భుతాన్ని సాధించేశాడు. ప్రతిష్ఠాత్మక అకాడెమీ హోర్లోగెర్‌ డెస్‌ క్రిటెపెండెంట్స్‌ ఇండిపెండెంట్స్‌లో ఏకైక రష్యన్‌ సభ్యుడైన కాన్‌స్టాంటిన్‌ చైకిన్‌ అనే వ్యక్తి అత్యంత పలుచనైన చేతి గడియారాన్ని రూపొందించారు. దీని మందం కేవలం 1.65 మిల్లీమీటర్లు. బరువైతే 13.3 గ్రాములే! ఆ లెక్కన ప్రపంచంలోనే అతి తేలికైన గడియారమూ ఇదే. గత వారం స్విట్జర్లాండ్‌లో జరిగిన ‘జెనీవా వాచ్‌ డేస్‌ ఫెయిర్‌’లో ఈ వాచీని ప్రదర్శించారు. స్టెయిన్లెస్‌ స్టీల్, టంగ్‌స్టన్‌ కార్బైడ్‌ వాడటంతో ఇది తేలిగ్గా ఉన్నా చాలా దృఢంగా ఉంటుంది.

కాగితం ముక్కంత పలుచన.. 
విశ్వసనీయమైన, ఖచి్చతమైన, ధరించేంత మన్నికైన అ్రల్టా–స్లిమ్‌ గడియారాలను ఉత్పత్తి చేయడం ప్రపంచంలోని గడియారాల తయారీదారులకు ఓ సవాలుగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో పలుచని గడియారాల తయారీ పోటీ ఊపందుకుంది. స్విస్‌ బ్రాండ్‌ పియాజెట్‌ 2018లో 2 మిల్లీమీటర్ల మందం కలిగిన గడియారాన్ని తయారు చేసింది. ఇది రెండేళ్ల తరువాత ఉత్పత్తిలోకి వచి్చంది. లగ్జరీ దిగ్గజం బుల్గారి కేవలం 1.8 మిల్లీమీటర్ల మందంతో వాచీని తెచ్చింది. 
వీటిని తలదన్నుతూ వాచ్‌ మేకర్‌ రిచర్డ్‌ మిల్లే 2022లో కాగితం ముక్కంత పలుచనైన గడియారాన్ని తయారు చేసింది. దాని ఖరీదు 500,000 డాలర్లకు పై చిలుకే! 
 

పాకెట్‌ వాచ్‌ ప్రేరణతో... 
2003లో తన పేరుతోనే వాచ్‌ మేకింగ్‌ బ్రాండ్‌ స్థాపించిన చైకిన్‌ 20 ఏళ్ల క్రితం 19వ శతాబ్దానికి చెందిన బాగ్నోలెట్‌ పాకెట్‌ వాచ్‌ను చూసి పలుచని వాచీలపై ఆసక్తి పెంచుకున్నాడట. సొంతంగా అల్ట్రాథిన్‌ వాచ్‌ డిజైన్‌ చేయాలని ఒక క్లయింట్‌ సవాలు చేయడంతో రంగంలోకి దిగాడు. ఇప్పుడు తయారు చేసిన బుల్లి వాచీకి  మున్ముందు నీలమణి లేదా వజ్రాలను పొదిగే ఆలోచన ఉందట! అనేక పేటెంట్లకు దరఖాస్తులు చేసినా ఇంకా ఏదీ ఖరారు కాలేదని చెప్పుకొచ్చాడు. వచ్చే ఏప్రిల్లో జెనీవాలో జరిగే వాచ్స్‌ అండ్‌ వండర్స్‌ ట్రేడ్‌ షోలో తన డిజైన్‌ తుది వెర్షన్‌ను సమరి్పస్తానని చెబుతున్నాడు. అప్పటికల్లా తన డిజైన్‌ మరింత కచ్చితత్వం, పవర్‌ సంతరించుకుంటుందని చెప్పాడు. ఈ వాచీకి ఇంకా ధర నిర్ణయించలేదు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)