Breaking News

రష్యాలో 9/11 తరహా దాడి!

Published on Sun, 12/22/2024 - 05:06

కజాన్‌: అమెరికాలోని ప్రపంచ వాణిజ్య సంస్థ జంట ఆకాశహర్మ్యాలను విమానాలు ఢీకొట్టిన దాడి ఘటన వీడియో విశ్వవ్యాప్తంగా నాడు వైరల్‌ అయింది. ఇప్పుడు అలాంటి దాడి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తమ భూభాగాల దురాక్రమణకు దిగిన రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌ ప్రతికార దాడులతో ప్రతిఘటిస్తున్న విషయం విదితమే. ఇందులోభాగంగా శనివారం రష్యాలోని టటారస్థాన్‌ పరిధిలోని కజాన్‌ నగరంలో జనావాస ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ డ్రోన్లతో దాడులకు తెగబడింది.

అందులో చూడ్డానికి అచ్చం చిన్నపాటి విమానంలా ఉన్న ఒక డ్రోన్‌ బహుళ అంతస్తుల బిల్డింగ్‌లో చివరి అంతస్తును ఢీకొనడం ఒక్కసారిగా మంటలు చెలరేగడం ఆ వీడియోలోఉంది. ఆరు డ్రోన్లు జనావాసాలపై, రెండు పారిశ్రామికవాడలపై పడ్డాయని టటారస్తాన్‌ గవర్నర్‌ రుస్తమ్‌ మిన్నీకన్నోవ్‌ ప్రకటించారు. అయితే ఈ దాడిలో ఎలాంటి పౌర ప్రాణనష్టం జరగలేదని రష్యా చెబుతోంది. అయితే దాడుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కజాన్‌ విమానాశ్రయాన్ని మూసేశారు.

ఈ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానాల రాకపోకలను నిలిపేశారు. ఆదివారం సైతం కజాన్‌ నగర ప్రజలు ఒకే చోట గుమికూడి ఉండొద్దని, జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లొద్దని గవర్నర్‌ రుస్తమ్‌ జాగ్రత్తలు చెప్పారు. గత 24 గంటల్లో ఉక్రెయిన్‌పైకి రష్యా 113 డ్రోన్ల దాడులు చేసింది. అయితే వీటిల్లో 57 డ్రోన్లను నేలమట్టంచేశామని ఉక్రెయిన్‌ తెలిపింది. 56 డ్రోన్లను నిరీ్వర్యం చేశామని తెలిపింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)