Breaking News

స్టార్ట్‌కు మరో ఏడాదిపాటు కట్టుబడి ఉంటాం: పుతిన్‌

Published on Tue, 09/23/2025 - 06:38

మాస్కో: అమెరికాతో కుదిరిన నూతన వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం(న్యూ స్టార్ట్‌)గడువు ముగిసిన తర్వాత కూడా మరో ఏడాది పాటు అణ్వాయుధ పరిమితులకు కట్టుబడి ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తెలిపారు. 2026 ఫిబ్రవరితో ఒప్పందం గడువు ముగియనున్నందున పొడిగింపునకు తమతో కలిసి రావాలని అమెరికాను ఆయన కోరారు. ఒప్పందంలోని షరతులకు అమెరికా లోబడి ఉంటుందని రష్యా ఆశిస్తోందన్నారు. 

వ్యూహాత్మక ఆయుధాలకు సంబంధించి అమెరికా కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ఒక వేళ అమెరికా క్షిపణి వ్యవస్థల మోహరింపును, అంతరిక్షంలో ఆయుధ వ్యవస్థల విస్తరణను చేపడితే తగు రీతిలో తమ చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఆయుధ పోటీని నివారించేందుకు ఉద్దేశించినన్యూ స్టార్ట్‌ ఒప్పందంపై 2010లో రష్యా అధ్యక్షుడు మెద్వెదెవ్, అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంతకాలు చేశారు. దీని ప్రకారం..ఇరు దేశాలు 1,550కు మించి అణు వార్‌ హెడ్లను, 700కు మించి  క్షిపణులు, బాంబర్లను కలిగి ఉండరాదు. 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)