Breaking News

దుస్సాహసం చేయొద్దు 

Published on Wed, 09/24/2025 - 06:34

బ్రస్సెల్స్‌: తన సభ్యదేశాల గగనతలాల్లోకి రష్యా యుద్ధ విమానాలు, డ్రోన్లు తరుచూ అక్రమంగా ప్రవేశించటంపై నాటో కూటమి తీవ్రంగా స్పందించింది. పదపదే దుస్సాహసానికి పాల్పడొద్దని రష్యాను హెచ్చరించింది. తన సభ్యదేశాల రక్షణ కోసం అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో పోలండ్, ఎస్తోనియా గగనతలాల్లోకి రష్యా డ్రోన్లు అక్రమంగా ప్రవేశించాయి.

 గత శుక్రవారం కూడా మూడు రష్యా ఫైటర్‌ జెట్లు తమ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించి 12 నిమిషాలపాటు చక్కర్లు కొట్టాయని ఎస్తోనియా ఆరోపించింది. ఈ ఆరోపణలను రష్యా తోసిపుచి్చనప్పటికీ నాటో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. రష్యా దూకుడును అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ‘సైనికపరంగానూ.. ఇతర మార్గాల ద్వారానూ మా సభ్యదేశాలను రక్షించుకుంటామనటంలో రష్యా ఏ విధమైన సందేహాలు పెట్టుకోవద్దు. ఎటునుంచి ఏ విధమైన ముప్పు వచి్చనా ఎదుర్కొంటాం’అని 32 దేశాల నాటో కూటమి మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. 

నాటో ఒప్పందంలోని ఆర్టికల్‌ 5 ప్రకారం కూటమిలోని ఏ ఒక్కదేశంపై ఇతరులు దాడిచేసినా.. కూటమిలోని అన్ని దేశాలపై దాడిచేసినట్లుగానే పరిగణిస్తామని గుర్తుచేసింది. తమ దేశ సమగ్రత, సార్వ¿ౌమత్వ రక్షణ కోసం నాటో వెంటనే జోక్యం చేసుకోవాలని నాటోను ఎస్తోనియా కోరింది. తమ గగనతలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించే ఎలాంటి వస్తువులనైనా ఎలాంటి చర్చలు లేకుండా నేలకూలుస్తామని పోలండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌ సోమవారం ప్రకటించారు. అయితే, ఈ విధానాన్ని కూటమిలోని అన్ని దేశాలు అంగీకరించిందీ లేనిదీ తెలియరాలేదు. ఉక్రెయిన్‌– రష్యా యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఈ నెల 10న పోలండ్‌ గగనతలంలో నాటో, రష్యా నేరుగా తలపడ్డట్లు వార్తలు వచ్చాయి. రష్యా డ్రోన్లు పోలండ్‌లోకి ప్రవేశించటంతో వాటిని కూలి్చనట్లు ఆ దేశం ప్రకటించింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)