Breaking News

‘నాటో’లో చేర్చుకుంటే పదవి వదులుకుంటా.. 

Published on Mon, 02/24/2025 - 04:23

కీవ్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ను ‘నాటో’ కూటమిలో చేర్చుకుంటే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధమేనని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌లో శాంతిని, నాటో సభ్యత్వాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఆదివారం రాజధాని కీవ్‌లో ప్రభుత్వ అధికారుల సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దండయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు. 

భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. నాటో సైనిక కూటమి రక్షణ కింద ఉక్రెయిన్‌ భద్రంగా        ఉండాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. నాటో ఛత్రఛాయలో ఉక్రెయిన్‌లో శాశ్వతంగా శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. శాంతి కోసం పదవి నుంచి దిగిపోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. 

‘‘ఉక్రెయిన్‌లో శాంతిని సాధించడానికి నేను అధ్యక్ష పదవిని వదుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందంటే, అందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని స్పష్టంచేశారు. అధ్యక్షుడిగా పదేళ్లు అధికారంలో ఉండాలన్నది తన కల కాదని వ్యాఖ్యానించారు. ‘జెలెన్‌స్కీ ఒక నియంత’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణలపైనా స్పందించారు. ట్రంప్‌ వ్యాఖ్యలను అభినందనగా భావించడం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు. సోమవారం యూరోపియన్‌ నేతలతో జరిగే సమావేశం ‘టర్నింగ్‌ పాయింట్‌’ అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. తమకు ఇప్పుడు సహకారం అవసరమని అన్నారు. 

తమ స్వాతంత్య్రాన్ని, గౌరవాన్ని కోల్పోయే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉక్రెయిన్‌–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించాలని ట్రంప్‌తోపాటు రష్యా అధినేత పుతిన్‌ అంటున్నారు. ప్రస్తుతం యుద్ధం జరుగుతుండడంతో ఉక్రెయిన్‌లో మార్షల్‌ లా విధించారు. ఎన్నికలపై నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవడానికి అభ్యంతరం లేదని జెలెన్‌స్కీ స్వయంగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్లతో ఆయన ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.  

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)