Breaking News

ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ఖచ్చితంగా ఉత్తర కొరియా మిసైల్‌!

Published on Sat, 01/06/2024 - 21:09

ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నగరంపై మిసైల్‌ దాడి చేసింది.  ఖార్కివ్‌పై రష్యా ప్రయోగించిన మిసైల్‌ ఆ దేశానికి చెందినది కాదని ఉక్రెయిన్‌ ప్రతినిధి డిమిట్రో చుబెంకో అన్నారు. జనవరి 2 తేదీని ఖార్కివ్‌ నగరంపై దాడి చేసిన రష్యా మిసైల్‌ గమనిస్తే.. రష్యా దేశానికి చెందినది కాదని తెలుస్తోందని పేర్కొన్నారు.

గతంలో రష్యా ప్రయోగించిన మిసైల్‌ కంటే పెద్దదిగా ఉందని అ‍న్నారు. దాని తయారి విధానం చూస్తే.. అధునాతనమైనదిగా లేదని చెప్పారు. గతంలో ఖార్కివ్‌పై రష్యా ప్రయోగించిన మిసైల్.. ఇప్పటి మిసైల్‌ను పరిశీలిస్తే  అది ఉత్తర కొరియాకు చెందినదిగా నిర్థారించడానికి అవకాశలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నాజిల్‌, ఎలక్ట్రికల్‌ వైండింగ్స్‌, పలు పరికారలు కూడా చాలా వ్యత్యాసంతో ఉన్నాయని  తెలిపారు.

ఇది ఖచ్చితంగా ఉత్తర కొరియా మిసైల్‌ అని తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నట్లు కూడా డిమిట్రో చుబెంకో తెలిపారు. అందుకే రష్యా వేసిన మిసైల్‌ ఉత్తర కొరియా నుంచి సరఫరా చేసినట్లుగా అనుమానం కలుగుతోందని తెలిపారు. రష్యా ఖార్కివ్‌ నగరంపై చేసిన మిసైల్‌ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 60 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.

చదవండి: Hamas Attackers: ‘వాళ్లు మనుషులు కాదు.. పెద్దగా నవ్వుతూ రాక్షస ఆనందం’

Videos

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)