Breaking News

రష్యా దాడుల్లో కీవ్‌ కకావికలం 

Published on Thu, 08/06/2026 - 05:55

కీవ్‌: గగనతల రక్షణ వ్యవస్థలు బలహీనంగా ఉన్న సమయంలో శత్రుదేశం నుంచి క్షిపణులు విరుచుకుపడితే విధ్వంసం ఏస్థాయిలో ఉంటుందో ఉక్రెయిన్‌కు రష్యా రుచిచూపించింది. మంగళవారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో బాలిస్టిక్‌ మిస్సైళ్లు, యాంటీ–షిప్‌ మిస్సైళ్లు, డ్రోన్లతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా సమీప ప్రాంతాలపై రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 

జనావాసాలు, రైల్వేస్టేషన్, ఇ–కామర్స్‌ సంస్థ, రిటైల్‌ సంస్థల గిడ్డంగులపై దాడులు జరగడంతో అందులోని కొందరు సిబ్బంది సైతం చనిపోయారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నారని, మరణాల సంఖ్య పెరిగే ఆస్కారముందని ఉక్రెయిన్‌ ప్రభుత్వం వెల్లడించింది. దాడుల్లో 44 మంది గాయాలపాలయ్యారని కీవ్‌ రీజియన్‌ సైనిక విభాగ సారథి తైమూర్‌ టకచెంకో తెలిపారు. ఈ దాడుల పాపం పరోక్షంగా యూరప్‌ మిత్రదేశాలదేనని ఉక్రెయిన్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. 

సమయానికి ఇంటర్‌సెప్టార్‌ మిస్సైళ్ల వంటి గగనతల రక్షణ వ్యవస్థలను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అసహనం వ్యక్తంచేశారు. శత్రుదేశ క్షిపణులను గాల్లోనే అడ్డగించే పేట్రియాట్‌ క్షిపణుల తయారీ సాంకేతికతను ఉక్రెయిన్‌కు ఇస్తామని హామీ ఇచ్చి తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట మార్చిన కొద్దిరోజులకే ఉక్రెయిన్‌పై ఇలా క్షిపణుల వాన కురవడం గమనార్హం. 24 బాలిస్టిక్‌ క్షిపణులు, మరో నాలుగు హైపర్‌సోనిక్‌ జిర్కోన్‌/సూపర్‌సోనిక్‌ ఓనిక్‌ క్రూజ్‌ క్షిపణులు, 115 డ్రోన్లను రష్యా ప్రయోగించింది. 

రష్యా డ్రోన్ల సంస్థ చీఫ్‌కు తీవ్రగాయాలు 
రష్యన్‌ కామకాజీ(ఆత్మాహుతి) డ్రోన్లుగా పేరుగాంచిన ఉపియర్‌ డ్రోన్లను తయారుచేసే ఉరాల్‌డ్రోన్‌ ప్లాంట్‌ సీఈఓ వ్లాదిమిర్‌ టకచుక్‌ కారు పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం స్వెర్డ్‌లోవోస్క్‌ రీజియన్‌లోని సంస్థ తయారీ కర్మాగారం వద్ద కారు పేలుడు సంభవించింది. దీంతో అందులోని వ్లాదిమిర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కారు పేలుడుకు కారకులెవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.  
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)