Breaking News

గణిత మేధావి.. తెలివితో 14 సార్లు లాటరీ గెలిచి..

Published on Sat, 06/15/2024 - 08:47

లెక్కలు అనగానే చాలామందికి బాల్యం నుంచే భయం ఏర్పడుతుంది. అంకెలను చూసే సరికి కొంతమందిలో వణుకు పుడుతుంది. అయితే గణితం సాయంతో పలు విషయాల్లో విజయం సాధించవచ్చని తెలిస్తే వారిలోని భయం తొలగిపోతుంది. రొమేనియాకు చెందిన ఒక గణిత మేధావి లెక్కలతో లాటరీలలోని లాజిక్కును పట్టేసి, ఏకంగా 14 సార్లు లాటరీ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

డైలీ స్టార్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం రొమేనియా నివాసి స్టెఫాన్ మాండెల్ గణిత శాస్త్రజ్ఞుడు. అతని జీతం భారత కరెన్సీతో పోలిస్తే ఏడు వేలు. అది అతని కనీస అవసరాలకు కూడా సరిపోయేది కాదు. దీంతో స్టెఫాన్‌ మాండెల్‌ తన జీవితాన్ని తక్షణం మార్చుకోవాలని,  గణితాన్ని తెలివిగా ఉపయోగించి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అంకెలను ఉపయోగించి ఒక సూత్రాన్ని సిద్ధం చేశాడు. దాని సాయంతో లాటరీలను గెలుచుకుంటూ వచ్చాడు.

స్టెఫాన్‌ స్వయంగా ప్రత్యేక అల్గారిథమ్‌ను సృష్టించాడు. పలు పరిశోధనలు సాగించిన అనంతరం ‘సంఖ్యల ఎంపిక’కు అల్గారిథమ్‌ను సిద్ధం చేశాడు. దానికి  ‘కాంబినేటోరియల్ కండెన్సేషన్’ అనే పేరు పెట్టాడు. తాను ఎన్ని లాటరీ టిక్కెట్లు కొన్నప్పటికీ, వాటికి అయ్యే ఖర్చు జాక్‌పాట్ కన్నా చాలా తక్కువగా ఉంటుందని స్టెఫాన్‌ కనుగొన్నాడు. దీంతో లాటరీని దక్కించుకునేందుకు అధికంగా లాటరీ టిక్కెట్లు కొని జాక్‌పాట్ గెలిచేందుకు వివిధ కాంబినేషన్‌లను సిద్ధం చేసేవారు. ఇది క్లిక్‌ అవడంతో స్టెఫాన్‌ లాటరీలను సొంతం  చేసుకుంటూ వచ్చాడు.

తరువాత స్టెఫాన్ లాటరీ సిండికేట్‌ను ఏర్పాటు చేశాడు. దీనిలో చేరినవారు స్టెఫాన్‌ సూచనలతో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇలా వారు గెలుపు అవకాశాలను పెంచుకుంటారు. ఈ సిండికేట్‌కు లాటరీలో వచ్చే భారీ మొత్తాన్ని సభ్యులంతా పంచుకునేవారు. ఈ విధంగా సంపాదించిన డబ్బుతో స్టెఫాన్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు.

స్టెఫాన్ మాండెల్ తాను కనుగొన్న లెక్కల సూత్రం ఆధారంగా మొత్తం 14 సార్లు లాటరీని గెలుచుకున్నాడు. తరువాతి కాలంలో యూకేలోనూ తన లాటరీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అయితే అతని సిండికేట్‌పై దర్యాప్తు సంస్థల కన్నుపడింది. దీంతో పెద్దమొత్తంలో టిక్కెట్లు కొనడంపై నిషేధం విధించారు. దీంతకితోడు స్టెఫాన్‌పై పలు కేసులు నమోదు కావడంతో న్యాయపోరాటం కోసం లెక్కకు మించినంత డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో  తాను కూడబెట్టిన సొమ్మునంతా పోగొట్టుకుని 1995లో తాను దివాలా తీసినట్లు స్టెఫాన్ ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం స్టెఫాన్ తన స్నేహితులతో పాటు వనాటు ద్వీపంలో నివసిస్తున్నాడు. యూనిలాడ్ నివేదిక ప్రకారం స్టెఫాన్ 1960-70ల కాలంలోనే లాటరీలలో రూ. 200 కోట్లకుపైగా మొత్తాన్ని గెలుచుకున్నాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)