Breaking News

జారి పట్టుతప్పినా పడిపోని ఒడుపు

Published on Mon, 12/16/2024 - 05:53

ఫూటుగా తాగిన వ్యక్తి చెరువు గట్టు దిగుతుంటే తూలి పడటం సహజం. ఒకవేళ తూలిపడబోతుంటే తమాయించుకుని నిలబడగలిగితే భలేగా నిలబడ్డాడే అని పక్కన ఉన్నవాళ్లు నవ్వుకుంటూ మెచ్చుకోవడం సహజం. మానవులకు సాధ్యమయ్యే ఇలాంటి పనిని మరమనిషి సైతం సాధించి చూపించింది. మట్టిగట్టుపై నడుస్తూ కాలిజారి గబాలున పడబోతూ రోబోట్‌ వెంటనే తమాయించుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం అధునాతన రొబోటిక్‌ సాంకేతికరంగంలో పెద్ద చర్చనీయాంశమైంది. మనిషికి సాధ్యమయ్యే అసంకల్పిత ప్రతీకార చర్యలు మరమనుషులకు సాధ్యమా? అనే చర్చ మొదలైంది. అయితే వీడియో చూసిన వాళ్లలో కొందరు నవ్వు తెప్పించే కామెంట్లు పెట్టారు. 

‘‘హ్యూమనాయిడ్‌ రోబోట్‌ ఆప్టిమస్‌ మనిషిలాగే నడవగలిగే సామర్థ్యం సాధించాలంటే ముందుగా మనిషిలాగా ఇలా జారాలి. వెంటనే సర్దుకొని నిలబడగలగాలి’’అని కామెంట్‌ చేశారు. ‘పార్టీకి వెళ్లొస్తూ తెల్లవారుజామున నాలుగు గంటలకు నేను ఇలాగే నడుస్తా’అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడీ రోబోలు పిల్లాడిలా నడుస్తున్నాయిగానీ చూస్తుండండి త్వరలో ఇవి తుపాకులు పట్టుకుని మన వెంటే పడతాయి’’అని ఇంకొకరు అన్నారు. ‘‘విమానం మెట్ల మీద, సైకిల్‌ తొక్కుతూ తరచూ పడిపోయే అమెరికా వృద్ధ అధ్యక్షుడు బైడెన్‌ కంటే ఈ రోబో చాలా బెటర్‌. పట్టుతప్పినా పడిపోలేదు’’అని ఇంకో వ్యక్తి కామెంట్‌ చేశారు.     

– న్యూయార్క్‌  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)