Breaking News

రోబో ఆత్మహత్య!?

Published on Sat, 07/06/2024 - 06:01

సియోల్‌: పరీక్ష సరిగా రాయలేదని, ప్రేమ విఫలమైందని, ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు తీసుకుంటున్న జనం వార్తలను మనం చూశాం. కానీ మరమనిషి సైతం ఆత్మహత్య చేసుకుంటాడన్న వార్త వింటానికి కొత్తగా ఉన్నా ఇది నిజంగా జరిగిందని దక్షిణకొరియా వార్తాసంస్థలు కోడై కూస్తున్నాయి. రోబో సేవలను విపరీతంగా వాడే దక్షిణ కొరియాలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. డాక్యుమెంట్ల డెలివరీ  వంటి పనుల్లో తెగ బిజీగా ఉండే ఓ రోబో సూసైడ్‌ చేసుకుందన్న వార్త సంచలనం సృష్టించింది. పని ఒత్తిడి వల్లే రోబోట్‌ ఆత్మహత్య చేసుకుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

చక్కర్లు కొట్టి.. మెట్లపై పడి 
గత గురువారం సాయంత్రం గుమీ నగర సిటీ కౌన్సిల్‌ భవనంలో ఈ రోబో ‘సూపర్‌వైజర్‌’ బాధ్యతల్లో ఉండగా ఉన్నట్టుండి ఆగిపోయి గుండ్రంగా తిరిగి మెట్లపై నుంచి పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఏకబిగిన పని చేయాల్సి రావడంతో విపరీత పని ఒత్తిడితోనే అది ఇలా చనిపోయిందని వార్తలొచ్చాయి. అమెరికాకు చెందిన బేర్‌రోబోటిక్స్‌ సంస్థ ఈ రోబోను తయారు చేసిచి్చంది. గత ఆగస్ట్‌ నుంచి అది చురుగ్గా పనిచేస్తోందట. ఈ రోబోకు సొంతంగా పౌరసేవల గుర్తింపు కార్డుంది! 

అంటే ఒకే ఫ్లోర్‌లోకాకుండా లిఫ్ట్‌లో తిరుగుతూ వేర్వేరు అంతస్తుల్లో పనులు చక్కబెట్టగలదు. ఇలాంటి రోబోట్‌ పొరపాటున మెట్ల పై నుంచి పడిందా? లేదంటే సాంకేతిక లోపమా? లేదంటే మరేదైనా సమస్యా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. రోబో శకలాలను స్వా«దీనంచేసుకుని ల్యాబ్‌కు పంపించారు. అనూహ్య ఘటన తర్వాత ఈ బిల్డింగ్‌లో మరో రోబోను పనిలో పెట్టుకోబోమని గుమీ సిటీ కౌన్సిల్‌ చెప్పింది. అయితే ద.కొరియాలో రోబోట్‌ సేవలు అత్యధికం. ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రోబోటిక్స్‌ గణాంకాల ప్రకారం ద.కొరియాలో ప్రతి పది మంది ఉద్యోగులకు ఒక పారిశ్రామిక అవసరాల రోబోట్‌ను వినియోగిస్తున్నారు.  

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)