Breaking News

రిషి సునాక్ ప్రభుత్వానికి షాక్.. ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ..

Published on Fri, 07/21/2023 - 11:09

లండన్: బ్రిటన్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ త్రుటిలో చావు దెబ్బ తప్పించుకుంది. మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క సీటు గెలుచుకుని మిగిలిన రెండు చోట్ల ఓటమిపాలైంది. అసలే సార్వత్రిక ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలు చాలా కీలకంగా నిలిచాయి.

మొత్తం మూడు స్థానాలకుగాను జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానాన్ని మాత్రం స్వల్ప మెజారిటీతో తిరిగి దక్కించుకుంది. ఒకవేళ ఆ స్థానాన్ని కూడా కోల్పోయి ఉంటే ఒకే రోజు మూడు సీట్లు కోల్పోయిన ప్రధానిగా రిషి సునాక్ చరిత్రలో నిలిచిపోయేవారు. 

అదృష్టవశాత్తు ఉక్స్ రిడ్జ్, సౌత్ రూస్లిప్ పరిధిలోని వెస్ట్ లండన్ లో గెలిచి ఆయన ఈ ఘోర అవమానం నుండి తప్పించుకున్నారు. మిగిలిన రెండు స్థానాల్లో సోమర్టన్, ఫ్రోమ్ సీట్ లో 19 వేలు, సెల్బీ.ఎయిన్స్టీ నియోజకవర్గంలో 20 వేలు మెజార్టీతో లేబర్ పార్టీ చేతిలో  ఓడిపోయింది కన్జర్వేటివ్ పార్టీ.    

సెల్బీ, ఎయిన్స్టీలో గెలిచిన అభ్యర్థి కెయిర్ మాథెర్(25) మాట్లాడుతూ.. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి ఇక్కడివారు అసంతృప్తితో ఇచ్చిన తీర్పు ఇదని అన్నారు. సోమర్టన్, ఫ్రోమ్ లో గెలిచిన లేబర్ పార్టీ అభ్యర్థి సారా డైక్ మాట్లాడుతూ.. ఇది చారిత్రిక విజయం. ఈ ప్రభుత్వం చేతకానితనంతో సర్కస్ చేస్తోందని ప్రజలకు అర్ధమైపోయిందన్నారు.  
  
అసలే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికల ఫలితాలు రిషి సునాక్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ గా మారాయి. గతేడాది మార్చ్ నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలను లేబర్ పార్టీ గెలుచుకోవడం ఆందోళనకరమని చెబుతున్నాయి కన్జర్వేటివ్ పార్టీ వర్గాలు. గడిచిన 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వడ్డీ  రేట్లు పెరగడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందుకే జనం ప్రభుత్వ విధానాలపై కొంత అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు స్థానికులు. 

ఇది కూడా చదవండి: 40 ఏళ్లుగా ప్రధాని.. మళ్ళీ ఆయనే..  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)