Breaking News

UK:మేయర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంపీ సస్పెండ్‌

Published on Sun, 02/25/2024 - 10:29

లండన్‌: బ్రిటన్‌ అధికార కన్జర్వేటివ్‌ పా​ర్టీ.. తన సొంతపార్టీ ఎంపీ, మాజీ డిప్యూటీ చైర్మన్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. లండన్‌ మేయర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ లీ అండర్సన్‌ను ప్రధానమంత్రి రిషి సునాక్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం కన్జర్వేటివ్‌ పా​ర్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

లండన్‌ మేయర్‌ సాదిక్ ఖాన్‌పై ఇస్లామిస్టుల ప్రభావం ఉందని, వారి నియంత్రణలో ఆయన ఉన్నారని ఓ టీవీ ఇంటర్వ్యూలో ఎంపీ లీ అండర్సన్‌ అన్నారు. దీంతో అయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాన మంత్రి రిషి సునాక్‌తో పాటు పార్టీ సీనియర్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు జాత్యహంకార పూరితమైనవి అని  వెంటనే క్షమాపణలు చేప్పాలని పెద్దఎత్తన డిమాండ్‌ చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి లీ అండర్సన్‌ నిరాకరించారు.

‘లండన్‌ మేయర్‌పై లీ ఆండర్సన్‌ చేసిన వ్యాఖ్యలపై క్షమాపన చెప్పడానికి నిరాకరించారు. దీంతో పార్టీ చీఫ్‌ విప్‌.. ఆయన్ను ఎంపీ పదవిపై సప్పెన్షన్‌ విధించారు’ అని అధికార ప్రతినిధి టోరీ శాసనసభ్యుడు సైమన్ హార్ట్ తెలిపారు. ఇక.. ఇజ్రాయెల్‌ దేశం.. గాజాపై దాడులు చేయటం ప్రారంభించినప్పటి నుంచి బ్రిటన్‌లో ఇస్లాంపై ద్వేషం, యూదులపై వ్యతిరేకమైన సంఘటనలు చోటు చేసుకోవటం పెరిగినట్లు తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)