Breaking News

ఏనుగు మళ్లీ జూలు విదిలిస్తుందా?

Published on Thu, 03/06/2025 - 05:00

వూలీ మమోత్‌.. భారీ ఆకారంతో, సింహం జూలును తలపించేలా తొండం నుంచి తోకదాకా దట్టమైన రోమాలతో భీకరంగా ఉండే ఏనుగు అది. అలాంటి ఏనుగును పునః సృష్టించేందుకు.. ఒక ‘ఎలుకంత’ ముందడుగు పడింది.

తల నుంచి తోకదాకా నిండా దట్టమైన రోమాలతో కూడిన ఎలుక జీవం పోసుకుంది. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ‘కొలోస్సల్‌ బయోసైన్సెస్‌’ శాస్త్రవేత్తలు చేసిన ఈ చిత్రమైన పరిశోధన ఏమిటో తెలుసుకుందామా...    –సాక్షి, సెంట్రల్‌డెస్క్‌

ధ్రువ ప్రాంత మంచులో దొరికిన ఆనవాళ్లతో..
భూమ్మీద తిరుగాడి, కాలక్రమేణా అంతరించిపోయిన అరుదైన జీవులను పునః సృష్టి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ‘కొలోస్సల్‌ బయోసైన్సెస్‌’ శాస్త్రవేత్తలు వూలీ మమోత్‌ ఏనుగులకు తిరిగి ప్రాణం పోసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర ధ్రువ ప్రాంతపు మంచులో దొరికిన వూలీ మమోత్‌ అవశేషాల్లోని జన్యువులను, ప్రస్తుతమున్న సాధారణ ఆసియన్‌ ఏనుగుల జన్యువులను పోల్చి చూశారు. 

మమోత్‌లలో దట్టమైన వెంట్రుకలకు కారణమైన జన్యువులను గుర్తించారు. దీనికి సంబంధించి తొలుత ఎలుకలపై ప్రయోగాలు చేపట్టారు. ‘‘అంతరించిపోయిన ఒకనాటి జీవులను పునః సృష్టించగలం అనేందుకు ఈ ఎలుకలు సజీవ సాక్ష్యం. భవిష్యత్తులో ఈ టెక్నాలజీతో వూలీ మమోత్‌లను పుట్టించి, ప్రకృతిలోకి వదిలిపెట్టగలం..’’అని కొలోస్సల్‌ సంస్థ చీఫ్‌ సైన్స్‌ ఆఫీసర్‌ బెత్‌ షాపిరో పేర్కొన్నారు.

1 ధ్రువ ప్రాంతపు మంచులో దొరికిన వూలీ మమోత్‌ అవశేషాల నుంచి జన్యువులను సేకరించారు.

2 ఇప్పుడున్న ఆసియా ఏనుగుల జన్యువులతో, వూలీ మమోత్‌ జన్యువులను పోల్చి  తేడాలను  గుర్తించారు.

3 ఎలుక పిండ కణాలను తీసుకుని.. వాటిలో పైచర్మం, వెంట్రుకలు, వాటి పొడవు, మందం తదితర లక్షణాలను నియంత్రించే ఎనిమిది జన్యువుల్లో.. మమోత్‌ల జన్యువుల తరహాలో మార్పులు చేశారు.

4 ఈ జన్యుమార్పిడి చేసిన పిండ కణాలను కొన్ని సాధారణ ఎలుకల  గర్భంలో  ప్రవేశపెట్టారు.

5 నిండా దట్టమైన రోమాలతో, అతి శీతల వాతావరణాన్ని కూడా తట్టుకోగలిగిన ‘ఊలు ఎలుకలు’ జన్మించాయి.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)