Breaking News

యూఎస్‌ కాంగ్రెస్‌లోనూ రిపబ్లికన్ల హవా..సెనేట్‌పై పట్టు..!

Published on Wed, 11/06/2024 - 12:57

వాషింగ్టన్‌:అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ల గాలి వీచింది. అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా కాంగ్రెస్‌ ఎన్నికల్లోనూ ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ సత్తా చాటింది. ఈసారి ఎన్నికల్లో సెనేట్‌లో మెజార్టీకి అవసరమైన సీట్లు రిపబ్లికన్‌ పార్టీకి లభించాయి.మరోవైపు హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో కూడా రిపబ్లికన్‌ పార్టీ ముందంజలో ఉంది. 

మొత్తం 100 సీట్లు ఉన్న సెనెట్‌లో 34 స్థానాలకు మంగళవారం(నవంబర్‌ 5) ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా సెనేట్‌లో డెమోక్రట్లకు ఉన్న ఒక సీటు మెజార్టీ కూడా పోయింది. తాజాగా సెనేట్‌లో రిపబ్లికన్లకు 51 మంది డెమోక్రట్లకు 42 మంది సభ్యులున్నారు.మరో 7 స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది.

సెనేట్‌లో మెజారిటీతో కొత్త ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలో రిపబ్లికన్లకు పట్టు లభించనుంది.ఇక 435 స్థానాలున్న హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్లకు 183 సీట్లు లభించాయి. దీంతో ఈసారి ట్రంప్ అధ్యక్ష పదవి గనుక చేపడితే ఆయనకు కాంగ్రెస్‌ నుంచి పెద్ద అడ్డంకులేవీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. 

ఇదీ చదవండి: డెమోక్రాట్లలో నిరాశ.. కమల ప్రసంగం రద్దు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)