Breaking News

థాయిలాండ్‌లో అద్భుతం

Published on Sun, 06/16/2024 - 04:56

అయూథలా: గజరాజును అత్యంత పవిత్రంగా భావించే థాయిలాండ్‌లో ఒక అద్భుతం జరిగింది. అరుదుగా సంభవించే కవలల జననానికి వేదికైంది. కవలలకు ఏనుగు జన్మనివ్వడం అరుదైన విషయమయితే అందులోనూ 36 ఏళ్ల ఒక ఏనుగు ఒక ఆడ, ఒక మగ గున్నలకు ఒకేసారి జన్మనివ్వడం అత్యంత అరుదైన సందర్భమని వెటర్నరీ వైద్యులు ప్రకటించారు. 

థాయిలాండ్‌లోని అయూథలా ప్రావిన్స్‌లోని అయూథలా ఏనుగుల ప్యాలెస్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటన వివరాలను అక్కడి సిబ్బంది వెల్లడించారు. 36 ఏళ్ల ఛామ్‌చూరీ శుక్రవారం ఒక మగ గున్నకు జన్మనిచ్చింది. ప్రసవం సాఫీగా జరిగిందనుకుని సంతోషపడి ఆ గున్నను నిలబెట్టే ప్రయత్నం చేస్తుండగా ఛామ్‌చూరీ మళ్లీ నొప్పులు పడటం అక్కడి మావటి, సిబ్బందిని ఆశ్చర్యంలో పడేసింది. 

అతి కష్టమ్మీద ఆడ గున్న బయటకురావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే మగ గున్నకు జన్మనిచ్చి బాగా నీరసించిపోయిన ఏనుగు వెంటనే మరో ఏనుగుకు జన్మనివ్వడంతో డీలాపడి కింద పడబోయింది. అప్పటికి ఆడ గున్నను కింద నుంచి తీయలేదు. ‘‘పెద్ద ఏనుగు మీద పడితే ఏమైనా ఉందా?. అందుకే వెంటనే ప్రాణాలకు తెగించి వెంటనే తల్లిఏనుగు కిందకు దూరి గున్న ఏనుగును బయటకు లాగేశా. 

కానీ అంతలోనే ఏనుగు పడిపోవడంతో నా కాలు విరిగింది. పసికూనను కాపాడాను అన్న ఆనందంలో నాకు కాలు విరిగిన బాధ కూడా తెలీలేదు. ఆస్పత్రికి వెళ్లాకే నొప్పి తెలిసింది’ అని 31 ఏళ్ల మావటి చరిన్‌ సోమ్‌వాంగ్‌ నవ్వుతూ చెప్పారు. ‘‘ నేనూ ఇదే ఏనుగుల ప్యాలెస్, రాయల్‌ ప్రాంగణంలో పుట్టి పెరిగా. కవలల జననాన్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఇంతకాలానికి ఇలా కుదిరింది.

 ఏనుగుల్లో కవలల జననం కేవలం ఒక్క శాతం మాత్రమే. ఇక ఆడ,మగ ఒకేసారి జననం అత్యంత అరుదైన విషయం’’ అని అక్కడి వెటర్నరీ మహిళా డాక్టర్‌ లార్డ్‌థోంగ్‌టేర్‌ మీపాన్‌ చెప్పారు. డాక్టర్‌ మీపాన్‌కు కూడా కవల పిల్లలున్నారు. కవల గున్నల జననం వార్త తెలిశాక స్థానికులు తండోపతండాలుగా ఏనుగుల పార్క్‌కు క్యూ కట్టారు. 60 కేజీల మగ, 55 కేజీల ఆడ గున్నలతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)