Breaking News

వెస్ట్‌మిన్‌స్టర్‌ హాల్‌లోనే రాణి శవపేటిక ఎందుకంటే..

Published on Mon, 09/19/2022 - 12:15

వెస్ట్‌మిన్‌స్టర్‌ హాల్‌ తలుపులు మూసుకుపోయాయి. భారత కాలమానం ప్రకారం.. వేకువఝామున నాలుగు గంటల సమయంలో క్యూ లైన్‌లను అనుమతించడం ఆపేశారు. అంటే.. సుదీర్ఘకాలం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ను పాలించిన క్వీన్‌ ఎలిజబెత్‌-2 అం‍తిమయాత్రలో కీలక ఘట్టం ముగిసిందన్నమాట. ఇక మిగిలింది అంత్యక్రియలే.. 

బ్రిటన్‌ సార్వభౌమాధికారులకు, గత.. ప్రస్తుత రాణి కాన్సోర్ట్‌లకు ఇచ్చే గౌరవం ఇదంతా. వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌కు 900 ఏళ్ల చరిత్ర ఉంది. పార్లమెంటరీ ఎస్టేట్‌లో అత్యంత పురాతనమైన బిల్డింగ్‌ ఇది. 

అత్యంత సువిశాలమైన భవనం మాత్రమే కాదు.. మిరుమిట్లు గొలిపే డిజైన్లతో గోడలు, అద్దాలు, పైకప్పు.. ఆకర్షనీయంగా ఉంటుంది. 

గతంలో కోర్టులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను సైతం ఇందులో నిర్వహించేవాళ్లు. 

1910లో కింగ్‌ ఎడ్వర్డ్‌-7 మరణాంతరం ఆయన భౌతికాయాన్ని వెస్ట్‌మిన్‌స్టర్‌ హాల్‌లో ప్రజాసందర్శనార్థం ఉంచారు. అప్పటి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది.

ఇంతకు ముందు.. 2002, మార్చి 30వ తేదీన క్వీన్‌ ఎలిజబెత్‌(క్వీన్‌ ఎలిజబెత్‌-2 తల్లి) మరణించగా.. అంత్యక్రియలకు పదిరోజుల ముందు నుంచి  వెస్ట్‌మిన్‌స్టర్‌ హాల్‌లో ఉంచారు. 

ఇప్పుడు.. గత బుధవారం నుంచి క్వీన్‌ ఎలిజబెత్‌-2 మృతదేహాన్ని ప్రజా సందర్శనార్థం ఉంచారు.

థేమ్స్‌ నది ఒడ్డున్న కిలోమీటర్ల మేర బారులు తీరి నిల్చున్నారు ఆమె అభిమానులు. రాణి గౌరవార్థం ప్రముఖులు సైతం ఒపికగా క్యూలో వచ్చారు.

రాణి అంత్యక్రియల కార్యక్రమాన్ని బ్రిటన్‌ వ్యాప్తంగా ఉన్న 125 సినిమా థియేటర్లు ప్రసారం చేయనున్నాయి.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలు దేశాల నేతలు, ప్రతినిధులు ఆమెకు నివాళులర్పించారు.

క్వీన్‌ ఎలిజబెత్‌-2 మృతదేహాంతో ఉన్న శవపేటికను వెస్ట్‌మిన్‌స్టర్‌ అబేను తరలించారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో వెస్ట్‌మినిస్టర్‌ అబేకు తరలిస్తారు. 

అక్కడ 2000 మంది అతిథులు(అందులో 500 మంది ప్రపంచ నేతలు) ఉంటారు. 

అబే నుంచి సెయింట్‌ జార్జిస్‌ చాపెల్‌ వద్ద క్రతువు కోసం రాణి శవపేటికను తరలిస్తారు. అక్కడ 800 మంది అతిథులకు స్థానం ఉంటుంది.

కింగ్‌ జార్జి- మెమోరియల్‌ చాపెల్‌ వద్ద.. రాణి శవపేటికను ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ సమాధి చెంతకు బ్రిటన్‌ రాజవంశానికి చెందిన కుటుంబ సభ్యుల సమక్షంలో చేరుస్తారు. 

చివర్లో శవపేటిక వెంట రాజు, రాణి, రాజవంశీయులు మాత్రమే ఉంటారు. 

సాయంత్రం శవపేటికను.. రాయల్‌ వాల్ట్‌లోకి దించుతారు. అక్కడ విండ్సర్‌ డీన్‌ కీర్తన ఉంటుంది. కాంటెర్‌బరీ ఆర్చిబిషప్‌ దీవెనలు, జాతీయ గీతాలాపతో అంత్యక్రియల కార్యక్రమం లాంఛనంగా(ప్రభుత్వ) ముగుస్తుంది. 

అయితే.. ఆపై విండ్సర్‌ డీన్‌ ఆధ్వర్యంలో రాజవంశీయులకు మాత్రమే పరిమితమైన తుది అంత్యక్రియల ప్రక్రియతో మొత్తం కార్యక్రమం ముగుస్తుంది. రాజవంశంలో రాజు/రాణిలకు దాదాపుగా ఇదే తరహాలో అంత్యక్రియలు జరుగుతుంటాయి.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)