Breaking News

స్లొవేకియాలో రష్యా అనుకూలవాది గెలుపు

Published on Mon, 10/02/2023 - 06:20

ప్రేగ్‌: యూరప్‌లోని చిన్న దేశం స్లొవేకియాలో ఎన్నికల ఫలితాలు అమెరికా, యూరప్‌ దేశాలకు కంగారు పుట్టిస్తున్నాయి. రష్యా అనుకూల మాజీ ప్రధాని రాబర్ట్‌ ఫికోకు చెందిన వామపక్ష స్మెర్‌(డైరెక్షన్‌)పార్టీ తాజాగా జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించింది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు మొదట్నుంచీ పొరుగునే ఉన్న స్లొవేకియా మద్దతుగా నిలుస్తోంది. ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఉక్రెయిన్‌ శరణార్థుల కోసం సరిహద్దులను తెరిచి ఉంచింది.

తాము అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌కు మద్దతు ఉపసంహరించుకుంటామని, వలసలను అడ్డుకుంటామని, రష్యాపై ఆంక్షలను ఎత్తివేస్తామని ప్రజలకు ఫికో హామీ ఇచ్చారు. గతంలో రెండు పర్యాయాలు ఫికో ప్రధానిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో ఏ పారీ్టకీ స్పష్టమైన మెజారిటీ రానప్పటికీ ఫికోయే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. స్లొవేకియా ఎన్నికల ఫలితాల గెలుపు ప్రభావం జర్మనీ, ఫ్రాన్సు, స్పెయిన్‌ వంటి దేశాల్లో మరికొద్ది రోజుల్లో జరగనున్న జాతీయ, ప్రాంతీయ ఎన్నికలపై పడుతుందన్నది పరిశీలకుల అంచనా.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)