Breaking News

మాల్దోవాలో ఈయూ అనుకూల పార్టీ గెలుపు

Published on Tue, 09/30/2025 - 05:22

చిసినౌ: ఒకప్పటి సోవియెట్‌ యూనియన్‌లో భాగంగా ఉన్న మాల్దోవాలో జరిగిన ఎన్నికల్లో యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) అనుకూల పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది. రష్యా అనుకూల గ్రూపులకు ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. తూర్పు, పశ్చిమ వర్గాలకు మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో వెలువడిన ఈ ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అన్ని పోలింగ్‌ స్టేషన్లలో లెక్కింపు పూర్తయ్యాక వెలువడిన ఫలితాల్లో ఈయూకు అనుకూల విధానాలను అనుసరించే అధ్యక్షురాలు మైయా సండూకు చెందిన అధికార యాక్షన్‌ అండ్‌ సాలిడారిటీ(పీఏఎస్‌)కు 50.1 శాతం ఓట్లు వచ్చినట్లు తేలింది.

రష్యా అనుకూల పేట్రియాటిక్‌ ఎలక్టోరల్‌ బ్లాక్‌కు కేవలం 24.2 శాతమే లభించాయి. రష్యాతో మైత్రిని కోరుకునే మరో గ్రూప్‌ ఆల్టర్నేటివా మూడవ, పాపులిస్ట్‌ అవర్‌ పార్టీ నాలుగో స్థానాల్లో నిలిచాయి. డెమోక్రసీ ఎట్‌ హోమ్‌ అనే పార్టీ కూడా పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం దక్కించుకుంది. అధికార పీఏఎస్‌కు 101 సీట్లున్న పార్లమెంట్‌లో 55 స్థానాలు దక్కాయి.

తిరిగి రష్యాకు అనుకూలంగా మారడమా, లేక ఈయూ మార్గంలో నడవడమా అనే విషయం మాల్దోవా వాసులు తేల్చుకునే నిర్ణయాత్మక ఎన్నికలుగా వీటిని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఫలితాలతో ప్రస్తుత ప్రభుత్వ విధానాలు కొనసాగుతాయని, ఈయూలో చేరాలని భావించే మాల్దోవా వాసులకు ఘన విజయంగా భావించవచ్చని అంటున్నారు.  ఫలితాలపై ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వొన్‌డెర్‌ లేయెన్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘యూరప్, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ’కోసం మాల్దోవా ప్రజల నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడిందన్నారు.

Videos

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు