Breaking News

సర్జరీ తర్వాత కెమెరా కంటపడిన బ్రిటన్‌ యువరాణి?

Published on Wed, 03/20/2024 - 06:52

బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన కోడలు కేట్ మిడిల్టన్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటి మధ్య కేట్ మిడిల్టన్ మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు. కేట్ మిడిల్టన్ ఇటీవల తన భర్త ప్రిన్స్ విలియమ్‌తో కలిసి లండన్ సమీపంలోని విండ్సర్ ఫార్మ్స్ లో కనిపించారు. బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం కేట్ మిడిల్టన్ ఆ సమయంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆమె బహిరంగంగా కనిపించడంపై  బ్రిటిష్ మీడియా హర్షం వ్యక్తం చేసింది.

బ్రిటిష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ షాపింగ్ చేస్తూ కనిపించారు. దీనిపై బ్రిటన్ మీడియా సంతోషం వ్యక్తం చేస్తూ ‘కేట్.. మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది’ అని రాసింది. కొన్ని మీడియా సంస్థలు ఈ జంటకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఒక క్రీడా కార్యక్రమానికి కేట్ మిడిల్టన్ తన భర్త, ముగ్గురు పిల్లలతో పాటు హాజరయ్యారని  ఓ బ్రిటిష్ వార్తాపత్రిక పేర్కొంది.

కేట్ మిడిల్టన్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ కారణంగా ఆమె గత ఏడాది చివరి నుండి బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇటీవల మదర్స్ డే సందర్భంగా కేట్ మిడిల్టన్ ఫోటో రివీల్ అయ్యింది. అయితే అది వివాదాస్పదంగా మారింది. అప్పటి నుండి మిడిల్టన్ ఆరోగ్యంపై పుకార్లు వెల్లువెత్తాయి. దీనికితోడు బ్రిటిష్ రాజభవనమైన కెన్సింగ్టన్ ప్యాలెస్‌లోని పలువురు  ఉద్యోగులు తాము కేట్‌ను చాలా రోజులుగా చూడలేదని పేర్కొన్నారు. దీంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)