Breaking News

Prince Harry: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్

Published on Tue, 04/25/2023 - 11:18

లండన్‌: బ్రిటన్‌ రాజకుటుంబంలోని విభేధాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. మే 6వ తేదీన జరగబోయే కింగ్‌ ఛార్లెస్‌ Charles III  పట్టాభిషేకం కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో.. ప్రిన్స్‌ హ్యారీ రాక గురించి ఆసక్తి నెలకొంది. అయితే అయిష్టంగానే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలుస్తోంది.

తండ్రి ఛార్లెస్‌ పిలుపు మేరకు ప్రిన్స్‌ హ్యారీ పట్టాభిషేకానికి హాజరు అవుతారని, కానీ, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారని రాజకుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. ప్రిన్సెస్‌ డయానా దగ్గర బట్లర్‌గా పని చేసిన పాల్‌ బరెల్‌.. ప్రస్తుతం రాజకుటుంబంలోని వ్యవహారాలను చూసుకుంటున్నారు.  ఆయన తాజా పరిణామాలపై స్పందించారు.  ఛార్లెస్‌, విలియమ్‌-హ్యారీల మధ్య సయోధ్య ఇప్పట్లో జరగకపోవచ్చు. పట్టాభిషేక కార్యక్రమంలో వాళ్ల మధ్య కనీసం మాటలు కూడా ఉండకపోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.

తండ్రిపై గౌరవంతో.. డ్యూక్‌ ఆఫ్‌ సస్సెక్స్‌ హోదాలో కేవలం ముఖం చూపించేందుకు మాత్రమే హ్యారీ అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. అంతేగానీ ఆ కుటుంబంలో మళ్లీ కలిసిపోవడానికి ఎంత మాత్రం కాదు అని పేర్కొన్నారు పాల్‌. 

ఇక మూడు రోజులు పాటు జరిగే పట్టాభిషేక మహోత్సవంలో కేవలం సింహాసనాన్ని అధిష్టించే కార్యక్రమం నాడు మాత్రమే ప్రిన్స్‌ హ్యారీ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు 24 గంటలు గడవక ముందే ఆయన యూకేను విడిచి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు పట్టాభిషేక సమ​యంలో ముందు వరుసలో కాకుండా.. దూరంగా ఎక్కడో పదో వరుసలో ఆయన కూర్చుంటారని సమాచారం. అయితే ఆయన భార్య మేఘన్‌ మార్కే హాజరుపై మాత్రం స్పష్టత లేదు.

క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణం అనంతరం రాజుగా పగ్గాలు చేపట్టిన ఛార్లెస్‌-3.. ఇప్పుడు ఎనిమిది నెలల తర్వాత పట్టాభిషేకం జరుపుకోబోతున్నారు.  బ్రిటిష్‌ సామ్రాజ్యానికి ఆయన 40వ చక్రవర్తి. ఆయన రెండో భార్య క్యామిల్లా యూకే రాణిగా బాధ్యతలు చేపట్టనుంది. అయితే.. పూర్తిస్థాయి మహారాణి హోదా కాదు. ఆ తరహా హోదాతో కూడిన క్వీన్‌ కాన్సోర్ట్‌ మాత్రమే. అంటే నామమాత్రపు మహారాణిగా బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో ఆమె నివసించనున్నారు.

రాజకుటుంబంలో ఏం జరిగింది? భార్యలు రాజేసిన చిచ్చు భగ్గున మండి..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)