నడి సముద్రంలో 95 రోజులు

Published on Mon, 03/17/2025 - 05:51

పది రోజుల చేపల వేటకని ఆయన బయలుదేరాడు. తుఫాను దారిని మళ్లించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన పసిఫిక్‌ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. ఎటు చూసినా నీళ్లు. నెల.. రెండు నెలలు.. మూడు నెలలు.. సముద్రంలోనే జీవితం. సరైన ఆహారం లేదు. మంచి నీరు కూడా లేదు. అయినా బతకాలన్న ఆశ అతడిని ఒడ్డున చేర్చింది. 95 రోజుల తరువాత గస్తీ బృందానికి దొరికాడు. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ కథ.. పెరూవియన్‌ మాక్సిమో నాపా కాస్ట్రో నిజ జీవితం. 


పెరూవియన్‌ తీరంలోని మార్కోనా పట్టణానికి చెందిన మాక్సిమో డిసెంబర్‌ 7న ఫిషింగ్‌ కోసం బయలుదేరాడు. రెండు వారాల ట్రిప్‌. అందుకు తగ్గట్టుగానే ఆహారాన్ని కూడా పఆయక్‌ చేసుకున్నాడు. పది రోజుల తరువాత వచి్చన తుఫాను అతని పడవను దారి మళ్లించింది. పసిఫిక్‌ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. అతని కుటుంబం, పెరూ సముద్ర గస్తీ దళాలు వెదకడం మొదలెట్టాయి. మరోవైపు నట్ట నడి సముద్రంలో తప్పిపోయిన మాక్సిమోకు ఎటు చూసినా నీళ్లు. కుటుంబంపైనే ధ్యాస. తన తల్లి గురించి, నెలల వయసున్న మనవరాలి గురించిన ఆలోచనలే.

అవే ఆయన జీవితంపై ఆశ.. ఎలాగైనా బతికి ఒడ్డుకు చేరాలన్న స్ఫూర్తిని ఇచ్చాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని తాగాడు. బతకడం కోసం కీటకాలు, పక్షులు, తాబేలును తిన్నాడు. ఎవరో ఒకరు కనిపెట్టేవరకూ తాను బతికుండాలన్న ఆశ అతని ప్రాణాలను నిటబెట్టింది. నాపా కాస్ట్రో కుటుంబం, మత్స్యకారుల బృందాలు మూడు నెలలుగా గాలిస్తూనే ఉన్నాయి. మూడు నెలలైనా ఆచూకీ దొరకలేదు. అయినా అటు కుటుంబం ఆశలు వదులు కోలేదు. ‘‘నాన్న నీవు రాకపోవడం మాకు అంతులేని బాధ. ఈ పరిస్థితిని ఎదుర్కొంటామని మేము ఎప్పుడూ అనుకోలేదు. మిమ్మల్ని కనుగొంటామనే ఆశ ఉంది’అని అతని కుమార్తె మార్చి 3న ఫేస్‌బుక్‌లో రాసింది. 

సరిగ్గా ఇది జరిగిన 8 రోజులకు మార్చి 11న ఈక్వడార్‌ గస్తీ బృందం ఫిషింగ్‌ బోటులో ఆయనను కనుగొన్నది తీరానికి 1,094 కి.మీ దూరంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాక్సిమోను రక్షించింది. వెంటనే ఈక్వెడార్, పెరూ సరిహద్దుకు సమీపంలోని పైటాలోని న్యూస్ట్రా సెనోరా డి లాస్‌ మెర్సిడెస్‌ ఆసుపత్రికి తరలించింది. గత 15 రోజులుగా ఏమీ తినకుండా ఉండటంతో తీవ్ర డీహడ్రేషన్‌కు గురయ్యారని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం మాక్సిమో సోదరుడికి అప్పగించారు. తన తండ్రి ప్రాణాలను కాపాడిన కుమార్తె ఇనెస్‌ నాపా టొర్రెస్‌ కృతజ్ఞతలు తెలిపింది. ‘ఈక్వెడార్‌ సోదరులారా>, నా తండ్రి గాటన్‌ను రక్షించినందుకు ధన్యవాదాలు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’అని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.      – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)