Breaking News

73వేలకు చేరిన గాజా మరణాలు

Published on Mon, 06/15/2026 - 02:28

డెయిర్‌ అల్‌ బాలాహ్‌: గతేడాది అక్టోబర్‌లో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నాసరే గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల దమనకాండ ఆగట్లేదు. దీంతో 2023 అక్టోబర్‌లో యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా గాజాలో మరణాల సంఖ్య 73,000కు చేరుకుందని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ సైనికులు యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారని గాజా మంత్రిత్వ శాఖలోని రికార్డ్‌ల విభాగం సారథి జహీర్‌ అల్‌ వహేదీ, ప్రజా సంబంధాల విభాగ సారథి హమ్జా సలీం తెలిపారు.

ఖాన్‌ యూనిస్‌లో ఇద్దరు, సెంట్రల్‌ గాజాలో ఒక్కరు, గత గాయాలతో మరో ఇద్దరు ఆదివారం చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 1,73,200 మందికిపైగా గాయాలపాలయ్యారు. 2023 అక్టోబర్‌ ఏడో తేదీన ఇజ్రాయెల్‌ శివారు గ్రామాలపై హమాస్‌ సాయుధులు మెరుపుదాడి చేసి అక్కడ స్థానికులు, పర్యాటకులు, విదేశీయులుసహా మొత్తంగా 1,200 మందిని చంపేశారు.

251 మందిని బంధించి గాజాకు తీసుకొచ్చి సొరంగాల్లో దాచిపెట్టడం తెల్సిందే. ప్రతీకారంగా గాజా నగరాలపై ఇజ్రాయెల్‌ మొదలెట్టిన భీకరదాడుల్లో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది పిల్లలు, మహిళలేనని గాజా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కొనసాగిన పరస్పర కాల్పుల ఘటనల్లో కేవలం ఐదుగురు ఇజ్రాయెల్‌ సైనికులే చనిపోయారు. 

#

Tags : 1

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)