Breaking News

మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్‌ ప్రకటన

Published on Wed, 05/14/2025 - 07:04

ఇస్లామాబాద్‌: భారత్, పాక్‌ పరస్పర సైనిక చర్యలో తమ సైనిక సిబ్బందిలో కేవలం 11 మంది చనిపోయారని పాకిస్తాన్‌ మంగళవారం ప్రకటించింది. వీరిలో స్క్వాడ్రాన్‌ లీడర్‌ ఉస్మాన్‌ యూసుఫ్‌ సైతం ఉన్నట్లు పేర్కొంది. భారత వైమానిక, క్షిపణి, డ్రోన్‌ దాడుల్లో సాయుధ బల గాలకు సంబంధించి 78 మంది గాయపడ్డారని పాకిస్తాన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా మే ఆరో తేదీ అర్ధరాత్రి తర్వాత భారత్‌ జరిపిన దాడుల్లో 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, 121 మంది పౌరులు గాయపడ్డారని తెలిపింది. చీఫ్‌ టెక్నీషియన్‌ ఔరంగజేబ్, సీనియర్‌ టెక్నీషియన్‌ నజీబ్, కార్పోరల్‌ టెక్నీషియన్‌ ఫరూఖ్, సీనియర్‌ టెక్నీషియన్‌ ముబాషిర్‌ సైతం ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వీళ్లంతా ఏ పరిస్థితుల్లో మరణించారో, మరణానికి కారణాలను పాకిస్తాన్‌ బయటపెట్టలేదు. ఒక యుద్ధవిమానం పాక్షికంగా ధ్వంసమైందని తెలిపింది.

అయితే అది ఏ సంస్థ తయారీ, ఏ రకానికి చెందినది అనే వివరాలనూ పాక్‌స్తాన్‌ వెల్లడించలేదు. ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా ‘మర్కా–ఇ–హక్‌ (ఘన విజయం)’ లక్ష్యంగా ‘ఆపరేషన్‌ బుని యాన్‌ అల్‌ మర్సుస్‌’ను చేపట్టామని ఆ ప్రకటన తెలిపింది. గాయపడిన సైనికులు, పౌరులను పరామర్శించేందుకు సోమవారం పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ రావల్పిండిలోని కంబైన్డ్‌ మిలటరీ ఆస్పత్రిని సందర్శించడం తెల్సిందే. గాయపడిన సైనికాధికారులు, జవాన్లను ఓదార్చేందుకు లాహోర్‌లోని కంబైన్డ్‌ మిలటరీ ఆస్పత్రిని పంజాబ్‌ మహిళా ముఖ్యమంత్రి మర్యం నవాజ్‌ సందర్శించారు.  

 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)