Breaking News

భారత సంతతి ప్రముఖులకు బ్రిటన్‌ గౌరవ పురస్కారాలు

Published on Wed, 01/01/2025 - 02:07

లండన్‌: నూతన సంవత్సరం సందర్భంగా బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3 అందించే గౌరవ పురస్కారాల జాబితాలో 30 మందికి పైగా భారత సంతతి వారికి చోటు లభించింది. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, విద్యారంగం, స్వచ్ఛంద సేవ సహా పలు రంగాల్లో ఆదర్శంగా నిలిచిన 1,200 మందిని జాబితాలో చేర్చారు. ‘‘వీరంతా సాధారణ వ్యక్తులే. అయినా అసాధారణ రీతిలో ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు’’అని బ్రిటన్‌ ప్రధాని కియర్‌ స్టార్మర్‌ ప్రశంసించారు. వారి అద్భుత సేవలను గుర్తించడాన్ని గౌరవంగా తమ ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. ‘‘వీరిలో చాలామంది ఓవైపు ఉద్యోగాలు చేస్తూనే సంఘ సేవను కొనసాగిస్తున్నారు. వీరిలో 12 శాతం మందిది మైనారిటీ నేపథ్యం’’అంటూ కేబినెట్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

జాబితాలో పలు రంగాల వారు 
శ్రీలంక, భారత మూలాలున్న బ్రిటన్‌ ఎంపీ రణిల్‌ మాల్కమ్‌ జయవర్ధనేకు రాజకీయ, ప్రజాసేవ రంగాల్లో నైట్‌హుడ్‌ దక్కనుంది. విద్యారంగంలో సేవలకు సత్వంత్‌ కౌర్‌ డియోల్‌ ‘కమాండర్స్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌’గౌరవం దక్కించుకున్నారు. న్యాయరంగంలో సేవలకు చార్లెస్‌ ప్రీతమ్‌ సింగ్‌ ధనోవా, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి ప్రొఫెసర్‌ స్నేహ ఖేమ్కా కూడా గౌరవ పురస్కారాలు అందుకోనున్నారు. 

జాబితాలో లీనా నాయర్, మయాంక్‌ ప్రకాశ్, పూరి్ణమ మూర్తి తణుకు, కార్డియాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ సంజయ్‌ ఆర్య, ప్రొఫెసర్‌ నందినీ దాస్, తర్సేమ్‌ సింగ్‌ ధలీవాల్, జాస్మిన్‌ దోతీవాలా, మోనికా కోహ్లి, శౌర్య మజుందార్, సీమా మిశ్రా, ఉష్మా మన్‌హర్‌ పటేల్, గ్యాన్‌ సంగ్‌ పవర్, శ్రావ్యా రావ్, మన్‌దీప్‌ కౌర్‌ సంఘేరా, సౌరజ్‌ సింగ్‌ సిద్ధూ, స్మృతీ శ్రీరామ్, టెక్‌ నిపుణుడు దలీమ్‌ కుమార్‌ బసు, నర్సింగ్‌ చీఫ్‌ మారిమౌత్‌ కౌమరసామి, రుమటాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ భాస్కర్‌ దాస్‌గుప్తా, పీడియాట్రిక్‌ హెమటాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ అజయ్‌ జైకిషోర్‌ వోరా, కమ్యూనిటీ వర్కర్లు సంజీబ్‌ భట్టాచార్య, జగ్‌రూప్‌ బిన్నీ, పోస్టల్‌ వర్కర్‌ హేమంద్ర హిందోచా, స్వచ్ఛంద కార్యకర్త జస్వీందర్‌ కుమార్, సంగీతకారుడు బల్బీర్‌సింగ్‌ ఖాన్‌పూర్‌ భుజాంగీ తదితరులకూ జాబితాలో చోటు దక్కింది.
 

Videos

మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్

ఆ 55 ఎకరాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్

ప్రకృతి డేంజర్ సిగ్నల్స్ ఇది వానా కాలమా.. ఎండా కాలమా..!

దళితులను, గిరిజనులను మనుషుల్లా చూడట్లేదు చంద్రబాబుపై దళిత నాయకులు ఫైర్

రూపాయి పతనం.. బంగారం ధరలపై ఎఫెక్ట్!

గుర్తుపెట్టుకో నైతిక విలువలు ముఖ్యం.. బొత్స అదిరిపోయే కౌంటర్

జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు

Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!

ఎవరూ శాశ్వతం కాదు.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై స్ట్రాంగ్ రియాక్షన్

నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్

Photos

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)

+5

వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ లుక్స్‌.. షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

+5

వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)

+5

కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)

+5

‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)