Breaking News

ఆకాశంలో అద్భుతం.. నేటి సాయంత్రం సూపర్‌ బ్లూ మూన్‌ దర్శనం

Published on Wed, 08/30/2023 - 10:40

నేడు(ఆగస్టు 30) ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. అరుదైన సూపర్ బ్లూ మూన్ కనువిందు చేయనుంది. రోజులా కాకుండా ఇవాళ చంద్రుడు పెద్దగా, కాంతివంతంగా దర్శనం ఇవ్వబోతున్నాడు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు పౌర్ణమి రావడంతో ఈ అద్భుతం జరగనుంది. నేడు చంద్రుడు భూమికి 3,57,244 కిలోమీటర్ల దూరంలో కనిపించనున్నాడు. కాగా బ్లూమూన్‌ అంటే చంద్రుడు బ్లూ కలర్‌లో కాకుండా నారింజ రంగులో దర్శనమివ్వనున్నాడు.

అయితే ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్‌ మూన్‌. ఆగస్టు 1న తొలి పౌర్ణమి నాడు బ్లూ మూన్‌ కనిపించింది. కాబట్టి నేడు కనిపించే చంద్రుడిని సూపర్‌ బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కానుంది. సాధారణంగా ఏడాదిలో రెండు లేదామూడు సూపర్ మూన్‌లు ఏర్పడుతూవుంటాయి.

స్పేస్‌.కామ్‌ ప్రకారం.. ఈ సూపర్‌ బ్లూ మూన్‌ బుధవారం రాత్రి 7.10 గంటలకు కనిపించనుంది. నాసా తెలిపిన దాని మేరకు రెండు గంటల తర్వాత ఇది అత్యంత ప్రకాశవంతంగా పెద్దదిగా  కనిపించనుంది. గురువారం ఉదయం 6.46 గంటలకు అస్తమించనుంది. అయితే బయట వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో ఈ మూన్‌ అందంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండియాలోని ప్రజలు తెల్లవారుజామున దీనిని చూడటం మంచిదని అంటున్నారు. 
చదవండి: ఆ అధికారం ఉందా?.. జమ్ము విభజనపై సుప్రీం

బ్లూ మూన్‌ అంటే..?
బ్లూ మూన్ అంటే  చంద్రుడు బ్లూలో కనిపించడం కాదు.  ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మాన్‌గా పిలుస్తుంటారు. ఒకే నెలలో బ్లూ మూన్‌, సూపర్‌ మూన్‌లు దర్వనమివ్వడం అరుదనే చెప్పాలి. ఇప్పుడు కనిపించే సూపర్‌ బ్లూ మూన్‌ నాలుగు పౌర్ణమిలతో కూడిన సీజన్‌లో అదనపు చంద్రుడు. బుధవారం ఏర్పడబోయే బ్లూ మూన్ ప్రత్యేకమైనది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్‌ మూన్‌ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు.

అరుదుగా బ్లూ మూన్‌
బ్లూ సూపర్‌ మూన్‌ చాలా అరుదుగా వస్తుంది. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతి పది సంవత్సరాలకు మాత్రం ఇలాంటిది వస్తుందని నాసా తెలపింది.. ఒక్కోసారి బ్లూ సూపర్‌ మూన్‌ రావడానికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పేర్కొంది. చివరిసారిగా బ్లూ బూన్‌ 2009 డిసెంబర్‌లో ఏర్పడింది. మళ్లీ 2037 జనవరిలో బ్లూ మూన్‌ కనపించనుందట.. మరొకటి మార్చిలో దర్శనమివ్వనుంది. అంటే మళ్లీ 14 సంవత్సరాల వరకు చూడలేరని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

#

Tags : 1

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)