ఎట్టకేలకు పెళ్లి కబురు చెప్పిన రొమాంటిక్‌ కపుల్‌ 

Published on Wed, 09/13/2023 - 20:56

రాచరికపు విలాసాలను కాదని సాధారణ జీవితాన్ని ఎంచుకున్న నార్వే యువరాణి మార్థా లూయిస్ గుర్తుందా. ప్రేమికుడు, హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్ ఆరో తరం షమన్ డ్యూరెక్ వెరేట్‌ను త్వరలోనే పెళ్లాడనుంది. ఈ  రొమాంటిక్‌  కపుల్‌ అధికారికంగా తమ పెళ్లి కబురును ప్రకటించారు. వచ్చే ఏడాది  ఆగస్టు  31న (2024 ఆగస్టు 31) పెళ్లాడ బోతున్నట్టు  బుధవారం ప్రకటించారు. (వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను)

నైరుతి నార్వేలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ,ఫ్జోర్డ్ ఒడ్డున  గీరాంజర్‌లో వివాహ వేడుక జరగనుంది. గీరాంజర్ అందమైన పరిసరాలలో  ప్రేమను సెలబ్రేట్‌ చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని ఈ లవ్‌బర్ట్స్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వీరి విహహ ప్రకటనపై రాజు హరాల్డ్ , రాణి సోంజా ,  ప్రిన్స్ హాకోన్ దంపతులను అభినందించారు "డ్యూరెక్ వెరెట్‌ను కుటుంబంలోకి స్వాగతించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.  (రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్‌బీఐ కీలక ఆదేశాలు )

2022 జూన్‌లో  మార్తా లూయిస్, డ్యూరెక్ వెరెట్  తమ నిశ్చితార్థాన్ని  ప్రకటించి, కింగ్ హెరాల్డ్ ఆశీర్వాదం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  గత ఏడాది నవంబరులో వెర్రెట్‌తో తన ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారంపై దృష్టి పెట్టడానికి ఆమె తన రాజ బాధ్యతలను వదులుకుంది. నార్వే యువరాణి టైటిల్‌ని మాత్రం వదులు కోలేదు. కానీ దానిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించనని అంగీకరించింది. తనకు ఎలాంటి వైభవాలు అక్కర్లేదంటూప్రియమైన వ్యక్తితో కలిసి అమెరికా వెళ్లిపోయింది. రాజకుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాని  ఆమె ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యామ్నాయ చికిత్సల అభిమాని అయిన లూయిస్‌ తాను  దేవదూతలతో మాట్లాడగలగడం తనకు లభించిన గిఫ్ట్‌అని  పేర్కొంది. 

అయితే లూయిస్ కు అంతకుముందే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే  భర్త, రచయిత అరిబెన్‌తో  విడాకులు తీసుకుంది. విడిపోయిన మూడేళ్లకు 2019లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు.  

.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)