Breaking News

తగ్గేదేలే అంటున్న కిమ్‌.. ఏఐతో సరికొత్త ప్లాన్‌

Published on Thu, 03/27/2025 - 09:18

సియోల్‌: ఉత్తరకొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) తమ దేశ సైనిక బలంపై ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే పలు మిస్సైల్స్‌ను పరీక్షించిన కిమ్‌.. తాజాగా అత్యాధునిక డ్రోన్ల పని తీరును పర్యవేక్షించారు. ఏఐ సాంకేతికతతో కూడిన ఆత్మాహుతి డ్రోన్లను ఉత్తరకొరియా తయారు చేసినట్టు అక్కడి అధికారిక మీడియా కథనాలు వెల్లడించాయి.

అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇటీవల డ్రోన్ల ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టిసారించారు. తాజాగా కృత్రిమ మేధస్సు (AI)తో తయారుచేసిన అత్యాధునిక డ్రోన్ల పరీక్షను ఆయన పర్యవేక్షించారు. భూమిపై, సముద్రంలో వ్యూహాత్మక లక్ష్యాలను, శత్రు కార్యకలాపాలను గుర్తించే సామర్థ్యం కలిగిన అత్యాధునిక నిఘా డ్రోన్‌ల పరీక్షను కిమ్‌ పర్యవేక్షించినట్లు నార్త్‌ కొరియా మీడియా వెల్లడించింది. ఈ సందర్బంగా కిమ్‌ మాట్లాడుతూ..‘ఆయుధాల ఆధునికీకరణలో మానవరహితమైనవి, కృత్రిమ మేధస్సు సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి’ అని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. అమెరికా, దాని మిత్ర దేశాలకు ఉత్తరకొరియా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్ట్‌లో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకను మోహరించారు. ఇది కిమ్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. ‘అమెరికాలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉ.కొరియాపై రాజకీయంగా, సైనికంగా రెచ్చగొట్టే చర్యలను ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ (బైడెన్‌ ప్రభుత్వం) శత్రుత్వ వైఖరినే ఇది ముందుకు తీసుకెళ్తోంది’ అని కిమ్‌.. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తామూ రెచ్చగొట్టే చర్యలు చేపడతామని బెదిరించారు. ఆయుధ పరీక్ష కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు.

Videos

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)