Breaking News

విరిగిన రోలర్ కోస్టర్ పిల్లర్.. తప్పిన పెను ప్రమాదం 

Published on Mon, 07/03/2023 - 17:57

నార్త్ కరోలినా: అత్యంత ఎత్తులో నిర్మితమైన ఓ రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతున్న సమయంలో వీడియో తీశాడు ఓ సందర్శకుడు. వీడియోలో ఒక సన్నివేశం చూసి గగుర్పాటుకు గురై వెంటనే నిర్వాహకులను అప్రమత్తం చేశాడు. ఈ రోలర్ కోస్టర్ తాలూకా బ్రిడ్జి పిల్లర్ ఒకదానికి బీట రావడంతో రైడ్ సమయంలో పక్కకు కదులుతూ ప్రమాదకరంగా కనిపించింది. అలాగే నిర్లక్ష్యంగా దీనిని నిర్వహించి ఉంటే ఎంతటి దారుణం జరిగేదోనని అంటున్నారు నెటిజన్లు.  

ఫ్యూరీ 325 పేరుతో నడిచే రోలర్ కోస్టర్ కు  స్థానికంగా విశేషమైన ప్రజాదరణ ఉంది.  ఈ రైడ్ ను జీవితంలో ఒక్కసారి అయినా ఆస్వాదించాలని ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే దీని నిర్వహకులు దీనిలోని ఒక పిల్లర్ కు బీట వచ్చిన విషయాన్ని గమనించలేదు. రోలర్ కోస్టర్ స్థితిగతులను పట్టించుకోకుండా యధావిధిగా నిర్వహిస్తూ కాసులు గడించే పనిలో నిమగ్నమయ్యారు. 

ఇక్కడికి విచ్చేసిన ఓ సందర్శకుడు తన మొబైల్ లో రోలర్ కోస్టర్ రైడ్ ను బంధించాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో అతను ఓ ప్రమాదాన్ని పసిగట్టాడు. ఆయన తీసిన వీడియోని నిశితంగా గమనించగా దీని పిల్లర్లలో ఒక పిల్లర్ కు పెద్ద బీటే వచ్చినట్లు  కనిపించింది. 

వీడియోలో బీట వచ్చిన పిల్లర్ గుండా రోలర్ కోస్టర్ వెళ్ళినప్పుడు పిల్లర్ కదులుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో ప్రస్తుతానికైతే ఈ రోలర్ కోస్టర్ రైడ్ ను నిలిపివేశారు.  మరమ్మత్తులు పూర్తయిన తర్వాతే దీన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. 

ఈ వీడియోని ఆ సందర్శకుడు ట్విట్టర్లో పొందుపరిచాడు. రోలర్ కోస్టర్ ఏ మాత్రం పట్టుతప్పినా అందులో ఉన్నవారి ప్రాణాల సంగతేమి కాను. గాలిలోని ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. సందర్శకుడు ఈ అమ్యూజ్మెంటు సంస్థ మేనేజ్మెంటును అప్రమత్తం చేసి పెను విపత్తునే తప్పించాడని నెటిజన్లు అతడిని అభినందిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్‌ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే..  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)