ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?
Breaking News
అరుణాచల్ సరిహద్దులో టెన్షన్.. ఎదురెదురుగా భారత్-చైనా సైనికులు!
మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి
వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ ‘ఐడీఎఫ్’ ఆపరేషన్
అంత్యక్రియల్లో కాల్పులు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
దక్షిణ పసిఫిక్లో భారీ భూకంపం.. రెండుసార్లు ప్రకంపనలు
అమెరికా సీక్రెట్ స్థావరాలపై వింత వస్తువులు.. ఏంటీ మిస్టరీ?
టీవీకే నేతపై లైంగిక దాడి కేసు.. మరుసటి రోజే షాకింగ్ ట్విస్ట్!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మెలానియా ఎంట్రీ.. 29న ఏం జరగనుంది?
ఇరాన్ బిగ్ ప్లాన్.. ట్రంప్ వార్నింగ్
ఎల్నినో అంటే భూతం కాదు.. కరువు: సీఎం రేవంత్
నైజీరియాలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ
Published on Fri, 09/15/2023 - 05:58
అబూజా: ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో గురువారం గాఢాంధకారం అలుముకుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ కుప్పకూలడంతో దేశమంతటా కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఉదయం విద్యుత్ ఉత్పత్తి సున్నా మెగావాట్లుగా నమోదైంది. ఆ తర్వాత క్రమంగా కరెంటు సరఫరాను పునరుద్ధరించారు.
నైజీరియాలో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడడం మామూలే. 2022లో ఏకంగా నాలుగు సార్లు గ్రిడ్ కుప్పకూలింది. అయితే, సాంకేతిక కారణాల వల్లే ఈ సమస్య తలెత్తుతోందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రెండు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అనుసంధానించే లైన్ అగ్నిప్రమాదానికి గురైందని, అందుకే గ్రిడ్ విఫలమైందని నైజీరియా విద్యుత్ శాఖ మంత్రి అడెబయో అడెలాబూ చెప్పారు.
#
Tags : 1