Breaking News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు ఇవే! భారత్‌ నుంచి మాత్రం..

Published on Sat, 12/03/2022 - 05:52

లండన్‌: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్‌ అగ్రభాగంలో నిలిచాయి. పెరుగుతున్న జీవన వ్యయం ఆధారంగా చేసుకొని లండన్‌కు చెందిన ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) 172 నగరాల జాబితాను రూపొందించింది.ఈ నగరాల్లో గత ఏడాదితో పోల్చి చూస్తే కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సగటున 8.1% పెరిగినట్టు తాను విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ నగరం గత ఏడాది మొదటి స్థానంలో ఉంటే ఈ సారి మూడో స్థానానికి తగ్గింది. ఆసియా దేశాల్లో ఏడాదిలో జీవన వ్యయం సగటున 4.5% పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. న్యూయార్క్, సింగపూర్‌ మొదటి స్థానాన్ని పంచుకుంటే నాలుగో స్థానంలో హాంకాంగ్, లాస్‌ఏంజెలెస్‌ నిలిచాయి.

సర్వే ఎలా చేశారంటే.!
ప్రపంచవ్యాప్తంగా 172 నగరాల్లోని 200కిపైగా నిత్యావసర వస్తువుల ధరలు, 400 వరకు రవాణా, వైద్య చికిత్స వంటి సేవల ధరల్ని పోల్చి చూస్తూ ఈ జాబితాను రూపొందించారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ సర్వే నిర్వహించినట్టుగా ఈఐయూ సంస్థ చీఫ్‌ ఉపాసన దత్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు, చైనాలో జీరో కోవిడ్‌ విధానం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వస్తు సామాగ్రి రవాణాలో ఆటంకాలు ఏర్పడి ధరలు పెరిగిపోయాయని , గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఎప్పుడూ చూడలేదని ఆమె తెలిపారు. అమెరికాలో ధరాభారం విపరీతంగా పెరిగిపోవడంతో ఆ దేశంలోని మూడు నగరాల్లో మొదటి పది స్థానాల్లో నిలిచాయని ఉపాసన వివరించారు.  

మన నగరాలు చౌక
ఇక భారత్‌లోని నగరాల్లో కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ తక్కువని ఈ సర్వేలో తేలింది. మొత్తం 172 దేశాలకు గాను  మన దేశంలో  బెంగుళూరు 161 స్థానంలోనూ చెన్నై 164, అహ్మదాబాద్‌ 165 స్థానంలోనూ నిలిచాయి. అత్యంత చౌక నగరాలుగా సిరియా రాజధాని డమాస్కస్, లిబియాలోని ట్రిపోలీ అట్టడుగున వరసగా 172, 171 స్థానాల్లో నిలిచాయి.

టాప్‌–10 ఖరీదైన నగరాలు ఇవే
1.     న్యూయార్క్‌ (అమెరికా)
1.     సింగపూర్‌
3.     టెల్‌ అవీవ్‌ (ఇజ్రాయెల్‌)
4.     హాంకాంగ్‌
4.     లాస్‌ ఏంజెలెస్‌ (అమెరికా)
6.     జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌)
7.     జెనీవా ( స్విట్జర్లాండ్‌)
8.     శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా)
9.     పారిస్‌ (ఫ్రాన్స్‌)
10.     కోపెన్‌హగెన్‌ (డెన్మార్క్‌)  
10.     సిడ్నీ (ఆస్ట్రేలియా)  

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)