Breaking News

8 నిమిషాల్లోనే గుండె వైఫల్యం నిర్ధారణ

Published on Sun, 09/25/2022 - 05:26

లండన్‌: సంప్రదాయ మ్యాగ్నెటిక్‌ రెజోనెన్స్‌ ఇమేజింగ్‌(ఎంఆర్‌ఐ) పరీక్ష ద్వారా గుండె వైఫల్యాన్ని గుర్తించేందుకు 20 నిమిషాలకుపైగా సమయం పడుతుంది. కానీ, కేవలం 8 నిమిషాల్లోనే గుర్తించే అత్యాధునిక సాంకేతికతను బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా పరిశోధకులు అభివృద్ధి చేశారు. అంటే ఎంఆర్‌ఐ పరీక్షతో పోలిస్తే సగం కంటే తక్కువ సమయంలోనే గుండె వైఫల్యాన్ని నిర్ధారించవచ్చు. దీనివల్ల సమస్యను 8 నిమిషాల్లోనే గుర్తించి, రోగులకు ప్రభావవంతమైన చికిత్స అందించవచ్చని పరిశోధకులు చెప్పారు.

ఎంఆర్‌ఐతో సవివరమైన 4డీ ఫ్లో చిత్రాలను అభివృద్ధి చేసి, గుండె పనితీరును తెలుసుకోవచ్చని అన్నారు. ఈ టెక్నాలజీకి ‘4డీ ఫ్లో ఎంఆర్‌ఐ’ అని పేరు పెట్టారు. ఇందులో గుండె కవాటాలు, గుండె లోపలికి రక్తప్రవాహాన్ని స్పష్టం చూడవచ్చు. వీటిని బట్టి రోగులకు ఎలాంటి చికిత్స అందించాలన్నది వైద్యులు నిర్ణయించుకోవచ్చు. ఈ పరిశోధన వివరాలను యూరోపియన్‌ రేడియాలజీ ఎక్స్‌పరిమెంటల్‌ పత్రికలో ప్రచురించారు. హార్ట్‌ ఫెయిల్యూర్‌ను గుర్తించే విషయంలో ఇది విప్లవాత్మకమైన టెక్నాలజీ అని పరిశోధకులు వెల్లడించారు.

Videos

Miss World Contestants: ఇండియాకు రావటం అదృష్టంగా భావిస్తున్నా

రామప్ప ఆలయంలో ప్రపంచ సుందరీమణులు

Nandini Gupta: తెలుగులో నా ఫేవరేట్ హీరో అతనే..

భారత్ కు పాకిస్థాన్ లేఖ

పథకాలు అమలు చేస్తున్న కానీ కాంగ్రెస్‌కి ప్రజల్లో వ్యతిరేకత

కెనడా విదేశాంగశాఖ మంత్రిగా అనితా ఆనంద్...

Chandrasekhar Reddy: విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం.. చంద్రబాబుపై ఫైర్

Rain Alert: అరేబియా సముద్రంలో బలపడుతున్న గాలులు

జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు

బలూచ్ గడ్డపై జెండా పాతిన తొలి హిందూ యువతి

Photos

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)