Breaking News

ఎవరెస్ట్‌ అధిరోహకులకు షాక్‌

Published on Fri, 01/24/2025 - 06:25

కాఠ్మండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్టు అధిరోహించాలనుకునే వారికి నేపాల్‌ ప్రభుత్వం పెద్ద షాక్‌ ఇచ్చింది. హిమాలయ శిఖరాన్ని దక్షిణం దిశ నుంచి మార్చి– మే మధ్య వసంత రుతువులో అధిరోహించాలనుకునే విదేశీయులు ఒక్కొక్కరి నుంచి వసూలు చేస్తున్న ఫీజు మొత్తాన్ని రూ.9.50 లక్షల నుంచి ఏకంగా రూ.13 లక్షలకు పెంచేసింది. సెప్టెంబర్‌–నవంబర్‌ మధ్యన ఫీజును రూ.4.75 లక్షల నుంచి రూ.6.48 లక్షలకు పెంచింది. శీతాకాలంలో డిసెంబర్‌–ఫిబ్రవరి మధ్య, వర్షాకాలం జూన్‌–ఆగస్టు సీజన్లలో ఒక్కో వ్యక్తి చెల్లించే ఫీజును రూ.2.37 లక్షల నుంచి రూ.3.24 లక్షలకు పెంచామని గురువారం ప్రకటించింది. 

నేపాలీ వ్యక్తులైతే వసంత రుతువులో చెల్లిస్తున్న రూ.75 వేల ఫీజును రూ.1.50 లక్షలకు పెంచినట్లు తెలిపింది. నూతన షరతులు ఈ ఏడాది సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది. పర్వతారోహణ పూర్తయిన వారు తమ వెంట తీసుకెళ్లిన మల విసర్జన బ్యాగ్‌ను తిరిగి బేస్‌ క్యాంపునకు వచ్చి, సక్రమంగా వదిలివేయాల్సి ఉంటుంది. 8 వేల మీటర్లకు పైగా శిఖరాలను అధిరోహించే వారు వ్యర్థాలను సేకరించేందుకు బయో డీగ్రేడబుల్‌ బ్యాగ్‌లను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని తెలిపింది. అంతేకాదు, పర్యాటక శాఖ అనుమతించిన వస్తువులనే  వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)