ఉక్రెయిన్‌పై దాడులు.. పుతిన్‌ దళంలోకి ‘కిమ్‌’ సైన్యం

Published on Mon, 10/28/2024 - 21:05

మాస్కో: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లకు పైగా సాగుతున్న దాడుల్లో రెండు దేశాల సైన్యం వీరోచితంగా పోరాడుతూనే ఉంది. ఇప్పటికే ఈ యుద్ధంలో ఎంతో మంది చనిపోయారు. ఈ పోరులో ఉక్రెయిన్‌ సైన్యం.. రష్యా భూభాగంలో అడుగుపెట్టింది. రష్యాతో పోరులో​ ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ఇప్పటికే పలు దేశాలు ముందుకు వచ్చాయి. మరోవైపు.. రష్యాకు సాయం చేసేందుకు ఉత్తర కొరియా బలగాలు రంగంలోకి దిగాయి.

ఉక్రెయిన్‌తో యుద్ధంలో మరింతగా పోరాడేందుకు ఉత్తర కొరియా తన బలగాలను రష్యాలోకి తరలిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా నాటో వెల్లడించింది. ఇప్పటికే రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కిమ్‌ బలగాలను మోహరించినట్లు నాటో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రష్యాలోని కుర్క్స్‌ ప్రాంతంలో కొన్ని బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టే మీడియాకు తెలిపారు. ఇక, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఇది రెండు మధ్య యుద్ధాన్ని మరింత ప్రోత్సహిస్తుందని అన్నారు.

ఇదిలా ఉండగా.. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. ఉత్తర కొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే పుతిన్‌.. ఉక్రెయిన్‌పై పోరుకు నార్త్‌ కొరియా సాయం కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. అందులో భాగంగానే ఉత్తర కొరియా సైన్యం రష్యాకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కొద్ది రోజుల క్రితమే ఉత్తర కొరియా సైన్యంలోకి భారీగా యువత వచ్చి చేరారు.

మరోవైపు.. రష్యాలోకి కిమ్‌ సేన ప్రవేశించే అంశంపై ఇటీవల అమెరికా స్పందించింది. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోనుందో అనే చర్చ కూడా జరుగుతోంది.

Videos

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)