Breaking News

యాక్సియోమ్‌–4  మిషన్‌ వాయిదా? 

Published on Sat, 02/08/2025 - 06:38

వాషింగ్టన్‌:  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ భూమిపైకి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే వారిని వెనక్కి తీసుకురావాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, స్పేస్‌ఎక్స్‌ సంస్థ తొలుత నిర్ణయించాయి. సాంకేతిక కారణాలతో మార్చి నెలకు వాయిదా వేశాయి. అది కూడా సాధ్యమయ్యే అవకాశం లేదని సైంటిస్టులు అంటున్నారు. 

ఐఎస్‌ఎస్‌ నుంచి ఇద్దరు వ్యోమగాములను రప్పించడానికి స్పేస్‌ఎక్స్‌ సిద్ధం చేస్తున్న నూతన అంతరిక్ష వాహనం ‘డ్రాగన్‌’లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. బ్యాటరీల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఎప్పటిలోగా సరి చేస్తారన్న ఎవరూ చెప్పలేకపోతున్నారు. డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ సిద్ధమైతే తప్ప సునీతా విలియమ్స్, విల్మోర్‌ వెనక్కి రాలేరు. ఏప్రిల్‌ నాటికి కూడా డ్రాగన్‌ అందుబాటలోకి రావడం అనుమానమేనని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

 ఇదిలా ఉండగా, సునీతా విలియమ్స్, విల్మోర్‌ రాక ఆలస్యమవుతుండడం మరో కీలక ప్రయోగంపై ప్రభావం చూపుతోంది. యాక్సియోమ్‌–4 మిషన్‌లో భాగంగా డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే భారత గ్రూప్‌ కెపె్టన్‌ శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు ప్రైవేట్‌ వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకోవాల్సి ఉంది. ఏప్రిల్‌లో ఈ ప్రయోగం చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు.

 డ్రాగన్‌లో సునీతా విలియమ్స్, విల్మోర్‌ను వెనక్కి వస్తేనే ఈ నలుగురు ఐఎస్‌ఎస్‌కు చేరుకోగలుగుతారు. లేకపోతే ప్రయోగం వాయిదా వేయక తప్పదు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 19లోగా ఇద్దరు వ్యోమగాములు వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు యాక్సియోమ్‌–4 మిషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సునీతా విలియమ్స్, విల్మోర్‌ గత ఏడాది జూన్‌లో బోయింగ్‌ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్‌ క్యాప్సూల్‌లో ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం వారం రోజుల్లో భూమిపైకి తిరిగిరావాలి. స్టార్‌లైనర్‌ క్యాప్సూల్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో అది సాధ్యం కాలేదు. వారిద్దరూ అక్కడే ఉండిపోయారు. వారి ఆరోగ్యం బాగుందని, ఎలాంటి సమస్యలు లేవని నాసా అధికారులు ప్రకటించారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)