Breaking News

రేపు సూర్యుడి సమీపానికి ‘నాసా’ పార్కర్‌

Published on Mon, 12/23/2024 - 04:53

న్యూయార్క్‌:  సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌గా ‘నాసా’ పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ రికార్డు సృష్టించబోతోంది. సూర్యగోళంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 2018లో అంతరిక్ష నౌకను ప్రయోగించింది. అప్పటినుంచి సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తూనే ఉంది. మంగళవారం ఇది లోకబాంధవుడికి అత్యంత సమీపంలోకి వెళ్లనుంది. అంటే భాస్కరుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్‌ మైళ్ల(6 మిలియన్‌ కిలోమీటర్లు) దూరానికి చేరుకుంటుంది. ఒక ఫుట్‌బాల్‌ మైదానాన్ని ఊహించుకుంటే ఒకవైపు సూర్యుడు, మరోవైపు భూమి ఉంటాయని, 4–యార్డ్‌ లైన్‌ వద్ద పార్కర్‌ ఉంటుందని నాసా సైంటిస్టు జో వెస్ట్‌లేక్‌ చెప్పారు.

సూర్య భగవానుడికి ఇంత సమీపంలోకి వెళ్లిన అంతరిక్ష నౌక ఇప్పటిదాకా ఏదీ లేదు. సూర్యుడికి దగ్గరిగా వెళ్లిన తర్వాత పార్కర్‌ నుంచి సమాచారం నిలిచిపోనుంది. అప్పుడు దాని పరిస్థితి ఏమటన్నది అంచనా వేయలేకపోతున్నారు. క్షేమంగా వెనక్కి వస్తుందా? లేక ఏదైనా జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో పార్కర్‌ అత్యంత వేగవంతమైనది. ఇది గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణానికి దెబ్బతినకుండా బలమైన హీట్‌ షీల్డ్‌ అమర్చారు. ఇది 1,371 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు. సూర్యుడికి దగ్గరగా వెళ్లిన తర్వాత వచ్చే ఏడాది సెపె్టంబర్‌ దాకా అదే కక్ష్యలోకి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యుడి ఉపరితలం కంటే కరోనా ఎందుకు వందల రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుందన్న సంగతి తెలుసుకోవడానికి పార్కర్‌ తగిన సమాచారం ఇస్తుందని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)