Breaking News

టైర్లు లేకున్నా ఠీవీగా దిగింది

Published on Thu, 01/29/2026 - 06:19

న్యూయార్క్‌: విమానం రన్‌వే మీద దిగేటప్పుడు ల్యాండింగ్‌ గేర్‌ సవ్యంగా తెరచుకుని టైర్ల మీదనే ల్యాండింగ్‌ అయ్యాక సైతం అగ్నిప్రమాదాల బారిన పడిన విమానాలు కోకొల్లలు. అలాంటిది టైర్లు బయటికి రాకుండానే నేరుగా విమానం బాడీ నేలను తాకినా విమానంలోని వారంతా క్షేమంగా ప్రాణాలతో బయటపడిన అద్భుత ఘటన అమెరికాలో జరిగింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వారి విమానం ప్రమాదానికి గురైనప్పుడు ఈ అరుదైన ఘటన సంభవించింది. 

సంబంధిత వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సంబంధిత వివరాలను నాసా తన ‘ఎక్స్‌’ఖాతాలో పోస్ట్‌చేసింది. టెక్సాస్‌ రాష్ట్రంలోని హూస్టన్‌కు ఆగ్నేయంగా ఉన్న ఎల్లింగ్టన్‌ విమానాశ్రయంలో ఈ విమానం సురక్షితంగా దిగింది. భూమి నుంచి గరిష్టంగా 63,000 అడుగుల ఎత్తులో ఆరున్నర గంటలపాటు ఏకధాటిగా ప్రయాణించగల డబ్ల్యూబీ57 రకం విమానాన్ని నాసా వినియోగిస్తోంది. 

జియోఇంజనీరింగ్‌ ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌ పరిశోధనల కోసం నాసా దీనిని ఉపయోగిస్తోంది. బుధవారం సైతం ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో హఠాత్తుగా సాంకేతికసమస్య ఎదురైంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. దీంతో సమీప ఎల్లింగ్టన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు ప్రయత్నించగా ల్యాండింగ్‌ గేర్‌ తెరచుకోకపోవడంతో టైర్లు లోపలివైపే ఉండిపోయాయి. అయినాసరే పైలట్ల ధైర్యంతో అలాగే విమానాన్ని కిందకు దింపారు. విమానం దిగువ బాడీ మొత్తం రన్‌వేను తాకుతూ అలాగే వందల మీటర్ల దూరం ముందుకెళ్లింది. దీంతో మంటలు చెలరేగాయి. వెనువెంటనే ఎయిర్‌పోర్ట్‌ అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేసి లోపలి వాళ్లందర్నీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 60,000 అడుగుల ఎత్తులో జరిగే ప్రయోగాల కోసం ఉపయోగించే కీలక విమానం బుగ్గిపాలుకాకుండా పైలట్లు భలేగా రక్షించారని పలువురు పొగడ్తల్లో ముంచెత్తారు.  

 


 

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)