Breaking News

అంతరిక్షంలో అతిథి

Published on Fri, 07/04/2025 - 01:32

భూమి దిశగా గ్రహశకలాలు దూసుకొస్తూ అతిథుల్లా పలకరిస్తుంటాయి. అయితే ప్రచండ వేగంతో రావడంతో భూవాతావరణంలోకి రాగానే మండిపోయి మసైపోతాయి. కానీ దేదీప్యమానంగా వెలిగిపోయే తోకతో మెరుపువేగంతో దూసుకొచ్చే తోకచుక్క ఇందుకు మినహాయింపు. ఆకాశంలో కనిపించినంతసేపు కనువిందు చేయడం దీని ప్రత్యేకత. అలాంటి తోక చుక్క ఒకటి మన సౌరమండలంలోకి అతిథిగా వచ్చిందని నాసా శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. 

దీనికి 3ఐ/అట్లాస్‌ అని నామకరణం చేశారు. చరిత్రలో ఇప్పటిదాకా సౌరకుటుంబం ఆవలి నుంచి వచ్చిన మూడో  కొత్త తోకచుక్క ఇదేనని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిలీలోని రియో హర్టాడో నగరంలో ఏర్పాటుచేసిన ఆస్ట్రరాయిడ్‌ టెరిస్ట్రియల్‌ –ఇంపాక్ట్‌ లాస్‌ అరైవల్‌ సిస్టమ్‌(అట్లాస్‌) సర్వే టెలిస్కోప్, అమెరికా శాన్‌డీగో కౌంటీలోని పాలమార్‌ అబ్జర్వేటరీ జ్వికీ టెలిస్కోప్‌లు ఈ తోకచుక్క రాకను జూలై ఒకటో తేదీన కనిపెట్టాయి. ధనస్సు రాశిగా పిలవబడే నక్షత్ర కూటమి వైపు నుంచి ఈ తోకచుక్క మన సౌరకుటుంబం దిశగా వచ్చిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

భూమికెలాంటి ప్రమాదం లేదన్న సైంటిస్టులు
ప్రస్తుతం ఈ తోకచుక్క భూమికి 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇంతదూరం నుంచి వెళ్తుండటంతో దీని కారణంగా భూమికి ఎలాంటి ప్రమాదం లేదని అధ్యయనకారులు తేల్చిచెప్పారు. ఈ తోకచుక్క తన మార్గంలో పయనిస్తూనే సూర్యుని సమీపంగా వెళ్లనుంది. ప్రస్తుతం ఇది సూర్యునికి 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్‌ 30వ తేదీన ఆదిత్యునికి అతి దగ్గరగా వెళ్లనుంది. కేవలం 21 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి అది తన పథంలో దూసుకుపోనుంది. అంటే అంగారక గ్రహం కంటే కూడా ఇది సూర్యుని సమీపానికి వెళ్లనుంది. సెప్టెంబర్‌ నెల వరకు ఖగోళ ఔత్సాహికులు ఈ తోకచుక్కను టెలిస్కోప్‌ సాయంతో చూడొచ్చు. 

తర్వాత అది సూర్యుని ఆవలిదిశ వైపుగా వెళ్లడంతో భూమి మీద నుంచి తోకచుక్క సరిగా కనిపించకపోవచ్చు. మళ్లీ డిసెంబర్‌ తర్వాత కనువిందు చేయనుంది. గతంలో 2017లో ఒక తోకచుక్క, 2019లో మరో తోకచుక్క ఇలా మన సౌరకుటుంబంలోకి అలా అతిథులుగా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. 1ఐ/ఓమువామూ, 2ఐ/బొరిసోవ్‌ తోకచుక్కల తరహాలోనే ఇది కూడా తోకచుక్కలకు సంబంధించిన మరింత వాస్తవిక సమాచారాన్ని అందించి వెళ్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త తోకచుక్క కావడంతో దీని తోక పొడవు, వెడల్పుల వివరాలు ఇంకా తెలియలేదు. కొత్త తోకచుక్కను సీ/2025 ఎన్‌1 అనే పేరుతోనూ పిలుస్తున్నారు.  


– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)